Albakara fruit Health Benefits : ఈ సీజన్ లో దొరికే ఈ పండు తింటే ఊహించని ఎన్నీ ప్రయోజనాలో....!!
ఈ సీజన్లో దొరికే ఆల్ బకరా పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఈ పండ్లు డ్రై గా కూడా లభ్యం అవుతుంది.
తాజాగా ఉండే పండ్లు ఎర్రగా నిగనిగ లాడుతూ రుచిలో పుల్లగా తియ్యగా ఉండే ఈ పండ్లను అసలు మిస్ కాకుండా తినటం అలవాటు చేసుకోండి.
బరువు తగ్గడానికి ఈ పండ్లు చాలా బాగా సహాయపడుతాయి. ఈ పండ్లను రోజులో ఒకటి లేదా రెండు తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది.అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .
ఈ పండ్లలో ఉండే విటమిన్ సి కండరాలను నిర్మించడానికి రక్తనాళాలను ఏర్పరచడం లోనూ సహాయపడుతుంది. కాస్త ఆందోళన ఒత్తిడి ఉన్నప్పుడు ఒక పండు తింటే ప్రశాంతమైన భావన కలుగుతుంది. ఆల్ బకరా పండులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది అలాగే శరీరంలో అదనంగా ఉన్న సోడియంను బయటకు పంపటానికి సహాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు ఈ పండులో ఉన్న ఫైబర్ మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా చక్కెర స్థాయిలను నియంత్రించటానికి సహాయపడే ఆడిపోనెక్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి సీజన్ లో వచ్చే ప్రతి పండును తినటానికి ప్రయత్నం చేయండి.
No comments