Almond Tea రోజుకో కప్పు `బాదం టీ` తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...?
ఉదయం లేవగానే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరైతే కడుపులో టీ పడందే ఏ పని చేయలేరు. అంతలా టీకి అలవాటు పడిపోతుంటారు. అయితే టీ లో ఎన్నో రకాలు ఉన్నాయి.
అందులో బాదం టీ కూడా ఒకటి. ఈ బాదం టీ రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా బోలెడన్ని ప్రయోజనాలను అందింస్తుంది. అందుకే రోజుకు ఒక కప్పు బాదం టీ తీసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఇంతకీ బాదం టీ ఎలా తయారు చేయాలి..? బాదం టీ తాగడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటీ..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు 10 బాదం పప్పులను నీటితో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నానిన బాదం పప్పులను తొక్క తీసేసి వాటర్‌తో సాయంతో మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో గ్రౌండ్ చేసిన బాదం, ఒక స్పూన్ బ్రౌన్ షుగర్‌ను యాడ్ చేసి హీట్ చేయాలి. బాగా మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే బాదం టీ సిద్ధమైనట్టే. ఈ బాదం టీని రోజుకో కప్పు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంంచిది.
ముఖ్యంగా రోజూ బాదం టీని సేవించడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి. మెదడు పని తీరు మెరుగు పడి జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. అలాగే కీళ్ల నొప్పులతో బాధ పడే వారు రెగ్యులర్‌గా బాదం టీని తీసుకుంటే.. ఎముకలు దృఢపడతాయి. దాంతో కీళ్ల నొప్పులు మాయం అవుతాయి.
అంతేకాదు, బాదం టీని రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో పేరుకు పోయిన కొవ్వంతా కరిగి పోతుంది. గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. చర్మం యవ్వనంగా మెరుస్తుంది. వయసు పెరిగినా వృద్ధాప్య ఛాయలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. మూత్ర పిండాళ్లు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి. మరియు హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది.
No comments