Latest

Loading...

Almonds benefits: బాదం పప్పును ఎంత సేపు నానబెట్టాలి?.. బాదం మామూలుగా తింటే ఏమవుతుంది...?

Almonds benefits

 కరోనా నేపథ్యంలో ఇమ్యునిటీ కోసం జనం పరుగులు పెడుతున్నారు. ఎక్కువగా డ్రైప్రూట్స్​, విటమిన్స్​ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. డ్రైప్రూట్స్​లో ముందు గుర్తుచ్చేది బాదం(almonds).


బాదంలో మాంసకృత్తులు. ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం (Health Benefits Of Almonds) ఉంది. పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌. వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండు, మూడు బాదం పప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది. అయితే మామూలుగా బాదంను నానబెట్టి తింటారు చాలామంది. మరికొందరు అలాగే తింటారు. ఇంతకీ బాదంను నానబెట్టి తింటే ప్రయోజనాలు ఏంటి, అసలు ఎంతసేపు నానబెట్టాలి తెలుసుకుందాం..


బాదం పప్పు ప్రయోజనాలు (Benefits of Almonds) ఎక్కువే. బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్(oxygen)​ చేరవేస్తుంది. బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు(weight) తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు. సాధారణంగా కొందరు బాదం నానబెట్టి తింటారు, మరికొందరు సాధారణంగా తినేస్తారు. రాత్రి నానబెట్టి ఉదయం బాదం తినేవారికి అధిక పోషకాలు అందుతాయి. ఇలా తినడం వల్ల బరువు తగ్గడం, రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు నుంచి మనల్ని దూరం చేస్తుంది. బాదం తొక్కలో టానిన్లు ఉంటాయి. నానబెట్టకుండా తింటే అవ మన శరీరంలోకి పోషకాలను సరిగా అందనీయవు.


ఓ నాలుగైదు బాదం పప్పులను నానబెట్టి రోజూ తింటే ఆరోగ్యంగా(Healthy), ఉత్సాహంగా ఉంటారు. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేదనుకుంటే.. నానబెట్టిన బాదంను ఉదయం పొట్టు తీసి తినవచ్చు. అప్పుడు పోషకాలు మీ శరీరానికి విరివిగా (Benefits of Almonds) అందుతాయి. పొట్టు తీసన బాదం మూడు, నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నార్మల్‌గా తింటే బాదం రుచిగా ఉంటుంది కానీ పోషకాలు అంతగా అందవు. నానబెట్టిన బాదం వారంలో ఓ నాలుగు రోజులు తింటే గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. బాదం నానబెట్టి తింటే మీకు పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.. మలబద్దకం సమస్యను బాదం దూరం చేస్తుంది.


No comments

Powered by Blogger.