Andhra Pradesh: పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు. ఆ రోజు నుంచే పనులు.....!!!
పేదలందరికీ ఇళ్లు నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
అక్టోబర్ 25 నుండి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఏపీ వ్యాప్తంగా లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తోంది. దీనిపై ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి మొత్తంగా 18 వేలకు పైగా గ్రూపులను ఏర్పాటు చేశారు అధికారులు. నిర్మాణంలో ఖర్చులు తగ్గించుకునే విధంగా.. ఇళ్ల నిర్మాణం జరుగుతున్న చోటే ఇటుక తయారీ యూనిట్లను సైతం ప్రొత్సహిస్తున్నామని సీఎం జగన్‌కి తెలియజేశారు అధికారులు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై కూడా చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పన పై డీపీఆర్ సిద్ధం చేశామన్నారు అధికారులు. కాలనీ ఒక యూనిట్‌గా చేసి.. పనులు అప్పగించాలని అధికారులను సీఎం జగన్ కోరారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు
పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంపై సీఎం జగన్ స్పందించారు. ఈ విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం వరించిందన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారన్న జగన్.. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ఆపేందుకు చాలామంది కుట్రలు పన్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పారు. ఈ విజయంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
No comments