AP E-KYC : ఏపీలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్-ఈ-కేవైసీ గడువు పొడిగింపు...!!
ఏపీలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ -కేవైసీ నమోదు కారణంగా తలెత్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నిన్నటితో ఈ-కేవైసీ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ దీన్ని నమోదు చేయించుకోని వారికి భారీ ఊరట దక్కింది.
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ రేషన్ పథకంలో భాగంగా లబ్దిదారులైన పేదలు ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు వీలుగా ఈ-కేవైసీని తప్పనిసరిగా నమోదు చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ నమోదును ప్రారంభించింది. అయితే కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆధార్ కేంద్రాలతో పాటు ఈ-కేవైసీ నమోదు కేంద్రాలు పనిచేయకపోవడం, భారీ ఎత్తున పిల్లా పాపలతో లబ్దిదారులు వీటికి పొటెత్తడంతో ఈ ప్రక్రియలో ఇభ్బందులు తలెత్తాయచి. దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ తప్పనిసరి అయినప్పటికీ లబ్దిదారుల్ని దృష్టిలో ఉంచుకుని పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది.
గతంలో రేషన్ కోసం ఈ-కేవైసీ నమోదుకు ఇచ్చిన గడువు ఆగస్టు 31తో పూర్తయింది. దీంతో వివిధ కారణాలతో ఇంకా నమోదు చేయించుకోని లబ్దిదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెల నుంచి రేషన్ కోతలు మొదలవుతాయనే భయాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదుకు గడువును ఈ నెల 15 వరకూ పెంచింది. అంటే మరో 15 రోజల పాటు ఈ-కేవైసీ నమోదు చేయించుకునేందుకు లబ్దిదారులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు శశిధర్ తెలిపారు.
గత నెలలో వరుసగా సెలవులు, పండుగలు రావడంతో పాటు సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు ప్రక్రియ నత్తడనకన సాగింది. సెలవులతో ఈ కేవైసీ నమోదుకేంద్రాలు పని చేయలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ నమోదుకు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. మిగతా వారికి మాత్రం ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకూ కొనసాగనుంది.
No comments