AP EAMCET Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల....సులువుగా ఇలా చెక్ చేసుకోండి.. పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్.....!!!
AP EAPCET Results 2021: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు (Engineering college admissions ) నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు విడుదల అయ్యాయి
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minster Adimulapu Suresh) ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ (Engineeing Counseling) ఆలస్యం కాకుండా ఉండేందుకు అధికారులు మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఈ కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఈ లింకును క్లిక్ చేసిన తరువాత AP EAMCET 2021 ఫలితంపై క్లిక్ చేయండి రిజిస్టర్ నంబర్, వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి, ఆ AP EAMCET ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత రిజల్ట్స్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
ఏపీ ఎంసెట్ ను ఈఏపీసెట్ గా మార్చామని మంత్రి ఆది మూలపు సురేష్ చెప్పారు. అయితే కరోనా సోకి ఎవరైనా పరీక్ష రాయలేకపోతే వారికి మళ్లీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది పరీక్ష రాసినవారిలో ఇంజనీరింగ్ లో 80 శాతం మంది అర్హత సాధించారని చెప్పారు. ఈ ఫలితాలకు సంబంధించి రేపటి నుంచి వెంట్ సైట్ లో ర్యాంక్ కార్డులు పెడుతున్నట్టు చెప్పారు.,
ఆంధ్ర్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పరీక్షలకు మొత్తం 1.76 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరిగాయి. కంప్యూటర్ విధానం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించారు. కరోనా నిబంధనలతో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు.
ఇక.. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.
ఇప్పటికే ఈ ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీలలో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజ్ తొలగించినట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. గతేడాది వరకు ఈ ఎంట్రన్స్ పరీక్షలలో విద్యార్థులకు వారి ఇంటర్ మార్కులకు గానూ 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను నిర్వహించని నేపథ్యంలో వెయిటేజ్ తొలిగిస్తున్నట్లు ఇటీవల ఇంటర్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే.
No comments