AP Govt: ప్రొబేషన్‌లోకి సచివాలయ కార్యదర్శులు.. ఆదేశాలు విడుదల...!!!
AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గామ్ర, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలో సచివాలయ ఉద్యోగులు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటారని, ఆ తరువాత ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్ అవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు సీబీఎస్ఎస్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే రెగ్యులర్ చేస్తున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత కాని ఉద్యోగులను మరోసారి ప్రొబేషన్ లోకి తీసుకోనున్నారు.
అయితే.. సీబీఎస్ఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి సంగతి పక్కబెడితే ఉత్తీర్ణత కాని వారు.. పరీక్షకు హాజరుకాని వారికి త్వరలోనే ప్రొబేషన్ గడువు పూర్తవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ కార్యదర్శకులకు సర్వీసులో చేరి త్వరలోనే రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఉద్యోగంలో చేరే సమయంలో రెండేళ్లే వారికి ప్రొబేషన్ ఇవ్వగా ఇప్పుడు మరోసారి ప్రొబేషన్ పీరియడ్ పొడగించనున్నారు. ఇప్పటికే సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్లను ఆదేశించారు.
2019 నుండి 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు పనిచేస్తుండగా.. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి వారందరికీ గడువు పూర్తవుతుంది. దీంతో వారిని వెంటనే ప్రొబేషన్ లోకి తీసుకొవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు విడుదల కావడంతో సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
No comments