Latest

Loading...

AP High Court: జిల్లా పరిషత్ ఎన్నికలు తిరిగి నిర్వహిస్తారా....ఇవాళే హైకోర్టు తీర్పు...!!

AP High Court:

 AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగనుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు మరోసారి నిర్వహించనున్నారా లేదా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందా. సర్వత్రా ఇదే అంశంపై ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో హైకోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (Ap Local Body Elections)సమరం ముగిసి అప్పుడే చాలాకాలమైంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ల నేపధ్యంలో ఎన్నికల కౌంటింగ్ మాత్రం నిలిచిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడ్నించి తిరిగి నిర్వహించేలా తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమీషన్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5వ తేదీన హైకోర్టు ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తీర్పు మాత్రం వాయిదా వేసింది.


రాష్ట్రంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు(Ap High Court) ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జే ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని తిరిగి నిర్వహించాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని ధర్మాసనం సమర్ధిస్తుందా లేదా వేచి చూడాలి. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ జరిగిన ఎన్నికల కౌంటింగ్‌కు(Election Counting)ఆదేశిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.




No comments

Powered by Blogger.