Latest

Loading...

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.....ఆ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం...!!


 బ్యాంక్ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపించింది.


ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. నేడు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో 12 ప్రభుత్వం రంగ బ్యాంకుల్లోని క్లరికల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలు( ప్రిలిమ్స్, మెయిన్స్) ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని పేర్కొంది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ వేసిన కమిటీ సూచనల ఆధారంగా పరీక్షలు జరగనున్నాయి. అప్పటివరకు ఐబీపీఎస్ 11వ ఎడిషన్ క్లరికల్ పరీక్షలు కూడా వాయిదా పడనున్నాయి. మరోవైపు ప్రాంతీయ భాషల్లోనూ క్లరికల్ ఉద్యోగాల పరీక్షల నిర్వహణ అనేది ఎస్‌బీఐ నియామకాల కోసం నిర్వహించే పరీక్షలకు కూడా వర్తించనుంది.


ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్‌)ను ఆర్థిక మంత్రిత్వ శాఖ జులైలో ఆదేశించింది. దేశ వ్యాప్తంగప్రభుత్వ బ్యాంకుల్లో 5,830 పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకీ ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022-23 సంవత్సరానికి భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 1 చివరి తేదీగా ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. కానీ ఆ నోటిఫికేషన్‌కు కేంద్రం బ్రేక్ లు వేసింది.


ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ కేడర్‌కు ప్రాంతీయ భాషల్లో టెస్ట్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు పరీక్షను నిలిపివేస్తున్నామని పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు పెట్టాలన్న డిమాండ్‌ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ 2019 జూలైలో పార్లమెంటులో స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టునే పరీక్షలను కొంతకాలం వాయిదా వేసిన కేంద్రం.. తాజాగా ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుని అనేకమంది నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.


No comments

Powered by Blogger.