Be Alert: రేపటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ సేవలు బంద్..!!
Internet will not work on these Smartphones from Tomorrow:
మీడియా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 30 అనగా రేపటి నుండి కొంతమంది ఇంటర్నెట్ వినియోగదారులు వరల్డ్ వైడ్ వెబ్‌ని (WWW)వినియోగించలేరు
చాలా ఫోన్లలో IdentTrust DST రూట్ CA X3 సర్టిఫికేట్ 30 సెప్టెంబర్ 2021 వరకి ముగియటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోనబోతున్నారు.
పాత మ్యాక్‌లు, ఐఫోన్‌లు, ప్లేస్టేషన్ 3 మరియు నింటెండో 3DS గేమింగ్ కన్సోల్‌లు, అనేక స్మార్ట్ టీవీలు, సెట్-టాప్ బాక్స్‌లు మరియు ఇతర "స్మార్ట్" పరికరాలు మరియు కొన్ని ప్లేస్టేషన్ 4 లు వంటి చాలా డివైస్ లలో రేపటి నుండి ఇంటర్నెట్ పని చేయదు.
లెట్స్ ఎన్‌క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇది ఇంటర్నెట్ మరియు మొబైల్, ల్యాప్‌టాప్, PC వంటి మీ పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ మీ డివైస్ ను సురక్షితంగా ఇంటర్నెట్ కు అనుసంధానం చేయటమే కాకుండా, మీ డేటా ను హ్యాకర్లు లు దొంగాలించాకుండా లేదా దుర్వినియోగ పరచకుండా చూస్తుంది. మీరు HTTPS తో ప్రారంభమయ్యే ఏ వెబ్‌సైట్ అయిన అది సురక్షితమని అర్థం. లెట్స్ ఎన్‌క్రిప్ట్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ 30 కంటే పాత సర్టిఫికెట్‌లను ఉపయోగించడాన్ని ఆపివేస్తుందని ప్రకటించినందున, మీ ఫోన్లను ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోండి.
ఎందుకు ఇంటర్నెట్ నడవదంటే?
సర్టిఫికెట్ గడుము ముగిసిన తరువాత ఎక్కువ మందికి కాకుండా కొంత మందిని మాత్రమే ప్రభావితం చేసే అవకాశం ఉంది. కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయని కంప్యూటర్‌లు మరియు బ్రౌజర్‌లు సెప్టెంబర్ 30 నుండి అంటే రేపటి నుండి ఇంటర్నెట్‌ను సేవలను పొందలేరు.
టెక్‌క్రంచ్ (TechCrunch) నివేదికల ప్రకారం, అప్డేట్ చేయని చాలా వరకు కంప్యూటర్లు, టాబ్లెట్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌లు ఈ ప్రకటనతో ఇంటర్నెట్ సేవలకు దూరం అవ్వనున్నాయి. అప్డేట్ చేయబడ్ద డివైస్ లు, కొత్తగా కొనుగోలు చేసిన డివైస్ లలో ఇంటర్నెట్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. నివేదిక ప్రకారం, MacOS 2016 మరియు Windows XP (with Service Pack 3) వంటి వాటిలో ఇంటర్నెట్ సేవలు కొనసాగకపోవచ్చు.
ఏం చేయాలి?
సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్‌లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైస్ లలో ఇంటర్నెట్ పని చేయదు. iOS 10 కంటే పాత వెర్షన్‌లను కలిగి ఉన్న ఐఫోన్‌లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైస్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి.
No comments