Latest

Loading...

Beetroot juice రోజూ ఉదయం ఒక కప్పు బీట్‌రూట్ ను తీసుకోండి.. అంతే.. అద్భుతమైన లాభాలు కలుగుతాయి..!

Beetroot juice


ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా లభించే దుంపల్లో బీట్‌రూట్ ఒకటి. ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్‌లతో చాలా మంది కూరలు చేసుకుంటారు.


కొందరు సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. అయితే వీటిని రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు మోతాదులో తీసుకుంటుండాలి. దీని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. బీట్‌రూట్‌లలో మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్ సి, ఫోలేట్‌, బి6, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, ఐరన్ ఉంటాయి. అందువల్ల ఇవి వ్యాధులు రాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.


2. హైబీపీ సమస్యతో బాధపడుతున్నవారు రోజూ బీట్‌రూట్‌ను తింటే ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.


3. బీట్‌రూట్‌లను తినడం వల్ల శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతో ఎక్కువ శ్రమ చేసినా అలసిపోరు. వ్యాయామం కూడా ఎక్కువ సేపు చేయవచ్చు.


4. శరీరంలో అంతర్గతంగా వాపులు రావడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌, స్థూలకాయం, గుండె జబ్బుల వంటి వ్యాధులు వస్తాయి. కానీ బీట్‌రూట్‌ను తినడం వల్ల ఆ వాపులు తగ్గుతాయి. దీంతో ఆయా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.


5. బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి.


6. బీట్‌రూట్‌ను తినడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగు పడుతుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.


7. బీట్‌రూట్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చు.


8. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ బీట్‌రూట్‌ను తినడం మంచిది. వీటిలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గిస్తుంది.


9. బీట్ రూట్‌ను తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.

No comments

Powered by Blogger.