Body Pains: బాడీ పెయిన్స్, నరాల బలహీనత, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మటుమాయం చేసే జ్యూస్......అదేంటో తెలుసా...!!
Body Pains: ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు.. చాలా మంది ఉద్యోగస్తులు, డెస్క్ జాబ్ చేసుకునే వారు ఎప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పులతో బాధపడుతున్నారు..
వాటిలో ఎక్కువగా సాధారణంగా బాధించే శారీరక నొప్పులు తల నొప్పి, నుడుం నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు.. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ తాగాలి..!! ఈ జ్యూస్ బాడీ పెయిన్స్, నరాల బలహీనత, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..!! ఈ అధ్భుత ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!
Body Pains: and Bad Cholesterol Reduce Home remedie
Body Pains: జ్యూస్ తయారీ విధానం..!!
కావలసిన పదార్థాలు:
లేత సొరకాయ – ఒకటి, పోదిన – చిన్న కప్పు, కొత్తిమీర – చిన్న కప్పు, తులసి ఆకులు – 10.
ముందుగా ఒక లేత సొరకాయను తీసుకోవాలి. దానిని చెక్కు తీసి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న కప్పు పోదిన, చిన్న కప్పు కొత్తిమీర, తులసి ఆకులు 10 తీసుకుని అన్నిటినీ కలిపి మిక్సి పట్టి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. సొరకాయ వేసవికాలంలో లభిస్తుంది . దీంట్లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.. ఇది దొరికిన ఆన్ని రోజులు జ్యూస్ గా తయారు చేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా తయారుచేసుకున్న జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవటం వలన ఇది డిటాక్స్ జ్యూస్ లా పనిచేస్తుంది.. దేహంలో కొవ్వు పేరుకుపోతే రక్త సరఫరా ఆగిపోతుంది. అది గుండె, లివర్ సమస్యలు, మూత్ర పిండాలు, జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి.. అందువలన మనం ఇంటి లో ఈ చక్కటి జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇది అధిక రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది. మీ గుండెను పదిలం గా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. జీర్ణం కాకుండా బాధిస్తున్న జీర్ణ వ్యవస్థను మెరుపరుస్తుంది. మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల జుట్టు వస్తుంటే ఆ సమస్యను నివారిస్తుంది. ఈ జ్యూస్ ప్రతిరోజు తాగటం వలన మీ చర్మ రంగును మెరుగుపరుస్తుంది. మిల మిల మెరిసే మోము మీ సొంతమవుతుంది. ఇది చూసిన పరగడుపున తాగితే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఖాళీ కడుపు తో ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగితే శరీరం లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది. శరీరానికి కావలసిన మన తక్షణ శక్తిని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తాగండి . అద్భుత ఫలితాలను పొందండి.
No comments