Boiled Eggs: ఉడికించిన గుడ్లను నిల్వ ఉంచేవాళ్లకు షాకింగ్ న్యూస్....?
గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఉడికించిన గుడ్లను ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా వెంటనే తినాలి. ఆలస్యంగా ఉడికించిన గుడ్లను తినాలని భావిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. గుడ్లలో శరీరానికి అవసరమైన కాల్షియంతో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణ గుడ్లను వారం రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను మాత్రం చల్లబడిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ లో గుడ్లను ఐదు రోజుల వరకు నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది. ఉడికించిన గుడ్లను వెంటనే తినకపోతే వాటిపై ఉన్న పొరను తీయకూడదు.
పొరను అలాగే ఉంచడం వల్ల గుడ్లపై బ్యాక్టీరియా సోకే అవకాశాలు అయితే ఉండవు. గుడ్లు ఉడికించే సమయంలో విరిగిపోతే వాటిని వెంటనే తినేయాలి. ఉడికించి పొర తీసిన గుడ్లు 2 గంటల పాటు బయట ఉంటే వాటిని మాత్రం తినకూడదు. ప్రోటీన్, ఇతర పోషకాలకు గుడ్డు మూలం కాగా గుడ్ల ద్వారా , విటమిన్లు ఎ, బి 6, బి 12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, లినోలిక్, ఒలేయిక్ యాసిడ్, ప్రోటీన్స్, ఐరన్, భాస్వరం లభిస్తాయి.
రక్తంలో ప్లేట్ లేట్లు పెరగాలంటే ఈ పదార్ధాలు తగ్గించకండి శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020, 13:08
గుడ్లను ఎక్కువ సమయం నిల్వ ఉంచితే ఆ గుడ్ల నుంచి చెడు వాసన వచ్చే అవకాశాలు ఉంటాయి. గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలని భావిస్తే వాటిని చల్లని నీటిలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా గుడ్లకు బ్యాక్టీరియా సోకే అవకాశాలు ఉండవు.
No comments