Latest

Loading...

Cashew Benefits కాజూ... ఇక రోజూ...

Cashew Benefits


నట్స్‌ తేలికగా, త్వరగా ఆకలిని తీర్చడమే కాదు. ఆకలిని దీర్ఘసమయాల పాటు అదుపులో కూడా ఉంచుతాయి. బాదం, వాల్‌నట్స్‌ మొదలైన డ్రై ఫ్రూట్స్‌తో పోల్చుకుంటే జీడిపప్పులో కొవ్వులు, క్యాలరీలు తక్కువ.


జీడిపప్పుతో చెడు కొలెస్ట్రాల్‌ (హెచ్‌డిఎల్‌) అదుపులోకి రావడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ (ఎల్‌డిఎల్‌) పెరుగుతుంది. జీడిపప్పు తినని వారితో పోల్చుకుంటే, వారంలో నాలుగు రోజులు జీడిపప్పు తినే వారిలో హృద్రోగ వ్యాధులు 37శాతం తక్కువ. ఇందుకు కారణం గుండెకు రక్షణనిచ్చే మోనోఅన్‌శాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్స్‌ కాజూలో సమృద్ధిగా ఉండడమే! జీడిపప్పు తినడం వల్ల కణాల డ్యామేజీ తగ్గుతుంది. వ్యాధులు, ఇన్‌ఫ్లమేషన్లు దరి చేరకుండా ఉంటాయి. పచ్చి జీడిపప్పు కంటే వేయించిన జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్‌ యాక్టివిటీ ఎక్కువ. గ్లూకోజ్‌ను నెమ్మదిగా, స్థిరంగా రక్తంలో కలిసేలా చేస్తాయి కాబట్టి జీడిపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

No comments

Powered by Blogger.