Latest

Loading...

Cheque Book: ఖాతాదారులకు అలర్ట్.....ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు....!!

Cheque Book

 బ్యాంకుల విలీనంతో (Banks Merger) అనేక మార్పులు వచ్చాయి. పాత బ్యాంకుల కస్టమర్లపై ఈ మార్పులు ప్రభావితం చేస్తున్నాయి.


కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలంటే ఓ బ్యాంకు కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. ఇతర బ్యాంకుల్ని విలీనం చేసుకున్న బ్యాంకులు ఈ మార్పుల గురించి కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా ఓ ముఖ్యమైన అలర్ట్ మెసేజ్ ట్వీట్ చేసింది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) పాత చెక్ బుక్స్ ఏవీ పనిచేయవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వెల్లడించింది. ఇకపై ఆ కస్టమర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్ వాడాల్సి ఉంటుంది. eOBC, eUNI పాత చెక్ బుక్స్ 2021 అక్టోబర్ 1 నుంచి పనిచేయవని, వాటిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్స్‌తో అప్‌డేట్ చేయాలని కోరుతోంది.


పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2020 ఏప్రిల్ 1న ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లుగా మారారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అనేక మార్పులు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌తో కొన్న కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని పాత ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను కోరుతోంది.


No comments

Powered by Blogger.