Latest

Loading...

Chia Seeds: చియా విత్తనాలతో ఎన్నీ ప్రయోజనాలో తెలుసా......!!

Chia Seeds

 

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చియా విత్తనాలు సహాయపడతాయి. ఇవి చాలా చిన్నగా నలుపు, తెలుపు రంగులో ఉంటాయి.

వీటిలో అనేక రకాల ఫైబర్, ఖనిజాలు, ప్రోటీన్లు ఉన్నాయి. ప్రొటీన్ లోపాన్ని అధిగమించాలంటే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. ఎముకలకు కాల్షియం చాలా అవసరం. చియా విత్తనాలలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

వయస్సుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గే వారిలో చియా విత్తనాల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్‌ అధికంగా ఉన్న విత్తనాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజలు చక్కటి ఎంపిక.

No comments

Powered by Blogger.