Latest

Loading...

రాత్రి లవంగాలు తింటే... ఈ సమస్యలు మటుమాయం...!!!

Cloves health benefits


లవంగాలను ప్రధానంగా మనం వంటలలో మసాలాగా ఉపయోగిస్తాము. సంప్రదాయకముగా వండే వంటలలో ముఖ్యంగా స్పైసి గా ఉండడానికి లవంగాలను వంటల్లో వాడతాం. మసాలా ఏదైనా లవంగం ఉండాల్సిందే.


కానీ దానిని డైరెక్టు గా తింటే ఆరోగ్యంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం లవంగం ప్రధానంగా జీర్ణ శక్తిని పెంచడానికి పని చేస్తుంది. లవంగం హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. శరీరంలోని గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. అపానవాయువు వంటి సమస్యలు ఉన్న వ్యక్తులు లవంగాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.


లవంగాలలో విటమిన్లు- B 1, B 2, B 4, B 6, B, విటమిన్-సి, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా లవంగాల నుండి విటమిన్-కె, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు వంటివి లభిస్తాయి. లవంగాలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. లవంగం జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలు తినాలి. లవంగాలు తినడం వల్ల పురుషుల సమస్యలన్నీ తగ్గిపోతాయి.


ప్రతి రాత్రి నిద్రపోయే సమయంలో మీరు 3 లవంగాలు తిని, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే కడుపుకు సంబంధించిన అనేక వ్యాధులు తొలగిపోతాయి.ఎందుకంటే లవంగాలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

 

No comments

Powered by Blogger.