Latest

Loading...

Corona vaccine టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న యూకే సైంటిస్టులు.. ఎందుకంటే.....?

Corona vaccine

 ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా ఎలా ఇబ్బందులు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. కాగా ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి అందరూ వ్యాక్సిన్‌ను వేయించుకుంటున్నారు.

పెదద్ దేశాలతో పాటు చిన్న చిన్న దేశాలు కూడా వ్యాక్సిన్ మంత్రాన్ని జపిస్తున్నారు. కాగా అందరికంటే ముందే వృద్ధులకు వ్యాక్సిన్లు రాగా క్రమక్రమంగా ఇప్పునడు వయోజనులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మంచి పరిణామమని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులతో పాటు టీనేజర్లకు కూడా వ్యాక్సిన్ వేసే విషయంలో టీకా ట్రయల్స్ జరుగుతున్నాయి.


ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే గనక చాలా త్వరలోనే యూత్‌కు కూడా అనగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా కొన్ని అడ్వాన్స్‌డ్ గా ఉన్న దేశాల్లో అయితే ఇప్పటికే టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి కూడా. కాగా ఇప్పుడు యూకేకు చెందిన నిపుణుల కమిటీ చేస్తున్న ప్రకటన సంచలనం రేపుతోంది. కాగా వారు టీనేజర్ల విషయంలో ఏ దేశం కూడా తొందరపాటు చేయొద్దంటూ కోరుంతోంది. ఇప్పటికే యూకేలో 12 నుంచి 17 ఏండ్ల వయస్సు పిల్లలకు టీకాలు వేయట్లేదని, కాగా ప్రపంచం కూడా ఆచితూచి స్పందించాలని సూచిస్తోంది.


ఈ వయస్సు పిల్లల్లో ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటే గనక వారికి టీకాలు ఇవ్వాలని, లేదంటే ఎవరైనా క్యాన్సర్లు లేదా డయాబెటిస్ లాంటి రోగాలతో ఉంటే అలాంటి వారికి టీకాలు ఇవ్వాలని అంతేగానీ ఆరోగ్యవంతులైన టీనేజర్లకు అస్సలు టీకాలు ఇవ్వొద్దంటూ సూచిస్తోంది. ఇంకా చెప్పాలంటూ వారికి టీకాలు అవసరం లేదంటూ సూచిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను లెక్కలోని తీసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యాక్సిన్లు వేయడం మంచిది కాదంటున్నారు. వ్యాధినిరోధక శక్తి ఉన్న యువతకు వ్యాక్సిన్ అవసరం లేదని, అలాగే ఒకసారి కొవిడ్ వచ్చి రికవరీ అయిన వారికి కూడా టీకా అక్కర్లేదంటూ చెబుతున్నారు.


No comments

Powered by Blogger.