Latest

Loading...

Corona. Vs Dengue కరోనా కంటే .....డెంగీ తోనే ఇబ్బందా .... !

Corona. Vs  Dengue

 దేశంలో చాలా రాష్ట్రాలలో కరోనా కంటే డెంగీ కి ఎక్కువ భయపడాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా డెంగీ మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతీసారి ముందస్తు జాగర్తలు తీసుకున్నప్పటికీ వాటి ప్రభావం మాత్రం ఉద్రుతంగానే ఉంటుంది.

 ఈసారి కరోనా మూడవ దఫా కోసం ఎదురు చూస్తున్నారు అందరు, ఎందుకంటే దానిప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని. కానీ దానికంటే ముందే డెంగీ వాళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుండటంతో కరోనా కంటే దానికే భయపడాల్సి వస్తుంది ఇప్పుడు. ఆయా ప్రభుత్వాలు కూడా ఒక పక్క కరోనా జాగర్తలు తీసుకుంటూనే, అదే దారిలో వాక్సిన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ, మరోపక్క డెంగీ గురించి తగు జాగర్తలు తీసుకుంది. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా దానిబారిన పడకుండా తగు జాగర్తలు తీసుకోవాలని ప్రచారం చేయిస్తుంది.


తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా తీరప్రాంతాలు, గ్రామాలలో ఈ ప్రభావం కనబడుతుంది. అటు తెలంగాణ లో కూడా ఈ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనితో ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికార వర్గానికి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటి వరకు కరోనా కేసులతో నిండిపోయిన ఆసుపత్రులు ఇప్పుడు డెంగీ రోగులతో నిండిపోతున్నాయి. నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులలో ఇన్, అవుట్ పేషెంట్ లతో నిండిపోయాయి. నిలోఫర్ లో అయితే ఎక్కువగా పిల్లలే కనిపిస్తున్నారు. ఈ ఆసుపత్రులలో రోజు కనీసం వెయ్యి మంది ఓపి ఉందంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.


గాంధీ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా ఎటు చూసినా పిల్లలే కనిపిస్తున్నారు. అందుకే ఇప్పటికే వైద్యులు పిల్లల పట్ల ఈ సీజన్ లో జాగర్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సీజన్ లో చిన్న జ్వరం వచ్చినా నిర్లక్ష్యం వహించకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ సీజన్ లో పిల్లలకు డెంగీ సహా మలేరియా, చికెన్ ఫాక్స్, టైఫాయిడ్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తగిన జాగర్తలు పాటించాలని వైద్యులు చెపుతున్నారు. ఈ పరిస్థితులలో అందరికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులు కూడా ఆయా ఆసుపత్రులకు తెలిపారు.


మరో ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే పిల్లలు సీజనల్ వ్యాధుల బారిన పడి వారికి ఉన్న ఇమ్మ్యూనిటి కోల్పోతున్నారు, ఇక అక్టోబర్ లో కరోనా మూడవ దఫా అంటున్నారు, ఈ రెంటిని పరికిస్తే, పిల్లలకు కరోనా ప్రభావం ఎక్కువ అనేదాని కంటే, పడిపోయిన వారి ఇమ్మ్యూనిటి వలన ప్రాణాంతకం అని చెప్పాల్సి వస్తుంది. అందుకే పెద్దలు తమ పిల్లల కోసం అయినా ఇంకొన్నాళ్ళు కరోనా జాగర్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. లేదంటే తరువాత ఏమి అనుకున్నా లాభం ఉండదు. పిల్లల ఇమ్మ్యూనిటి దెబ్బతిన్నాక కరోనా ప్రభావం వారిపై ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకొని మీమీ జాగర్తలు పాటించాల్సిందిగా వినతి. తస్మాత్ జాగర్త!

No comments

Powered by Blogger.