Covid-19 Vaccine : రెండు డోసులు వేర్వేరు వ్యాక్సిన్లు వద్దు : స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్య శాఖ....?
Central Govt Says Exchange Of Corona Vaccines:
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరి.
ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మరి ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి? కోవాగ్జిన్ వేయించుకోవాలా? కోవీషీల్డ్ వేయించుకోవాలా? ఈరెండు వేయించుకోవాలా? రెండు డోసులు వేరే వేరు వ్యాక్సిన్లు వేయించుకోవాలా? రెండు వేయించుకున్నాక బూస్టర్ కూడా వేయించుకోవాలా? ఇలా ఎన్నో ఆలోచనలు.మరోన్నో అనుమానాలు. ఇంకెన్నో సందిగ్థతలు.వీటన్నింటికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క్లారిటీ ఇచ్చింది. అలాగే రెండు డోసులు వేయించుకన్నవారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది.
మొదటి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటారో రెండో డోసు కూడా అదే వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.వ్యాక్సిన్ల విషయంలో వస్తున్న పలు అనుమానాలను నివృత్తి చేస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. కోవిన్ యాప్‌తో అందరికీ ఒకే వ్యాక్సిన్ అందేలా ఏర్పాటు చేసామని వెల్లడించింది. మొదటి డోసు ఏ టీకా వేశారో రెండో డోస్ కూడా అదే వేసేలా నిర్వాహకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఈ నివేదికల్లో వెల్లడించింది.
అయితే రెండు డోసుల టీకాలు ఎంతకాలం కరోనా నుంచి రక్షణనిస్తాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో రెండో డోసు తర్వాత బూస్టర్ డోసు అవసరంపై ఇంకా నిర్ణయించలేదని వెల్లడించింది. అలాగే రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనని..అలాగే భౌతికదూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమను కాపాడకుంటునే తోటివారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత అని సూచించింది. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో నిర్ధారణ కాలేదని..కాబట్టి కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టంచేసింది
No comments