Latest

Loading...

కరోనా పేషెంట్లు రాత్రివేళ పెరుగు తింటే ఏం అవుతుందో. మీకు తెలుసా...?

Curd benefits


కరోనా వైరస్‌.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. కంటికి కనిపించని ఈ మహమ్మారి ప్రపంచదేశాలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ మాయదారి వైరస్‌ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ పంపినీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.


అయినప్పటికీ కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే కరోనా దెబ్బకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరికో వైరస్‌ను జయించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కరోనా సోకిన వారు.. ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది.


ముఖ్యంగా తీసుకునే ఆహారంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే, కరోనా సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఒల్లు నొప్పులు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇవి తీవ్ర తరం కాకుండా ఉండాలంటే.. కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాంటి వాటిలో పెరుగు కూడా ఒకటి. వాస్తవానికి పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


పెరుగులో ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ బి, విటిమన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ పెరుగు ఉపయోగపడుతుంది. మరి ఇన్ని పోషకాలు ఉండే పెరుగును కరోనా పేషెంట్లు ఎందుకు తినకూడదని అంటున్నారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.

కరోనా వైరస్ సోకిన వారికి కూడా పెరుగు ఎంతో మంచిది. కానీ, రాత్రి పూట మాత్రం కరోనా పేషెంట్లు పెరుగును తినకపోవడమే మంచిది. పైన చెప్పుకున్నట్టు కరోనా బారిన పడిన వారిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. రాత్రి పూట పెరుగు తింటే.. ఈ సమస్యలు మరింత తీవ్రంగా మారిపోతాయి. అలాగే పెరుగు రాత్రిపూట తినడం వలన గొంతులో కఫం ఏర్పడుతుంది. దాంతో నిద్ర పాడవడంతో పాటుగా.. అసౌకర్యానికి కూడా గురవుతారు. కాబట్టి, పెరుగును రాత్రి కాకుండా.. పగటి పూట తీసుకోవడం మంచిది. కావాలనుకుంటే.. రాత్రి వేళ పల్చగా మజ్జిగ చేసుకుని తీసుకోవచ్చు.

No comments

Powered by Blogger.