Debit Cards: ఇంటర్నెట్ లేకున్నా కార్డు లావాదేవీలు చేయొచ్చు....!!
మనలో చాలా మంది డెబిట్ కార్డులను వాడతాం. ఏదైన చోటుకు వెళ్లినప్పుడు కార్డు ఇస్తే సార్.. నెట్‌వర్క్(Networking) సిగ్నల్ సరిగా లేదని.. చెబుతుంటారు.
అప్పుడు మనం ఇబ్బంది పడుతుంటాం. కచ్చితంగా నగదు వాడాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యకు ఇకపై చెక్ పడనుంది. డెబిట్ కార్డు(Debit Cards) వినియోగదారులకు మేలు చేసేలా టెక్నాలజీ(Technology) రాబోతుంది. నగదు లావాదేవీకి డెబిట్ కార్డులో ఇంటర్నెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ సాంకేతికతను వీసా తయారు చేస్తోంది. ఇంటర్నెట్ లేకున్నా.. లావాదేవీలు నిర్వహించేలా కొత్త సాంకేతకితను మిషిన్(Machine)లకు అందిస్తోంది. కాకుంటే ప్రస్తుతం ఈ లావాదేవీల పరిమితి రూ.2000 వరకు మాత్రమే. అంటే రూ.2000 లోపు డెబిట్ కార్డు వినియోగానికి ఇంటర్నెట్ అవసరం లేదనమాట.
వ్యాపారులకు, ఖాతా దారులకు ఉపయుక్తం..
కోవిడ్ మహమ్మారి రాకతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అందుకే, మరింత మందికి ఈ సేవలు అందించేలా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. మనం కార్డు వినియోగించినప్పుడు ఇంటర్నెట్(Internet) లేకుంటే ఇటు వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరు ఇబ్బంది పడుతుంటారు. పలు సందర్బాల్లో ఇతర చెల్లింపు మార్గాలు పని చేయకుంటే గొడవలు కూడా జరుగుతుంటాయి.
ఇది మన నిత్యం చూస్తున్న సమస్యే. ఇప్పుడు ఈ టెక్నాలజీతో ఆ సమస్య దూరం కానుంది. అంతర్జాతీయ(International) నగదు బిజినెస్ మర్చెంట్ వీసా ఈ టెక్నాలజీని ఇండియాలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని ఫెయిల్(Fail) అవుతున్నట్లు గతంలో ఆర్‌బీఐ(RBI) తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకొని వస్తోంది.
ఇక పీఓసీ కార్డులు..
ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీపెయిడ్(Prepaid) కార్డులు ఉన్నాయి. వాటికి భిన్నంగా పీఓసీ కార్డులు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ కార్డులు నెట్‌వర్క్ క్లౌడ్(Network Cloud) ఆధారంగా పని చేస్తాయి. ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్ లైన్ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పద్ధతిలో ఒక డెబిట్ కార్డు తయారు చేసింది. ఈ డెబిట్ కార్డులో రోజువారీ లావాదేవీ(Trans పరిమితి రూ.2,000 మాత్రమే ఉంటుంది. ఒక లావాదేవీ సామర్థ్యం రూ.200 ఉంటుంది. తగిన బ్యాలెన్స్ లేకుంటే లావాదేవీలు తిరస్కరించబడతాయని ఆర్బీఐ తెలిపింది. ఈ సాంకేతికితో పీఓసీ కార్డును యస్ బ్యాంక్(Yes Bank), యాక్సిస్ బ్యాంక్(Axis Bank) మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి.
No comments