Latest

Loading...

Disc Problems: ఎముకల సమస్యకు అద్భుతమైన ఇంటి మందు...!!

Disc Problems

 Disc Problems: వీపు భాగంలో వచ్చే నొప్పిని వెన్ను నొప్పి అంటారు.. ఇది ఎక్కువగా బాధిస్తుంటుంది.. వెన్నుపాములో ఉన్న ఎముకలు తేలికగా కదలడానికి షాక్ అబ్జర్వర్స్ గా పనిచేసే డిస్క్ లలో రెండు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి..


డిస్క్ సమస్యలతో తలెత్తే వెన్నునొప్పిని పెయిన్ కిల్లర్స్తో తగ్గించుకోవడం సరైన పద్ధతి కాదు.. డిస్కు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే.. డిస్క్ సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వీటి ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.. వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలకు ను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం..!!


Disc Problems: home remedies excellent results

Disc Problems: వెన్నుముక డిస్కుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా..!!


కావలిసిన పదార్థాలు :

తుమ్మ చెక్క బెరడు – 50 గ్రాములు, తుమ్మ చెక్క కాయలు – 50 గ్రాములు, తుమ్మ చెక్క జిగురు దోరగా వేయించినది – 50 గ్రాములు, బూరుగు జిగురు – 50 గ్రాములు, తెల్ల మద్ది చూర్ణం – 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం – 50 గ్రాములు.


పైన చెప్పిన మోతాదు లో పొడులన్నింటిని తీసుకుని సమానంగా బెల్లం లేదా పటిక బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.. ఈ పొడిని ఉదయం భోజనానికి అరగంట ముందు ఒకటిన్నర స్పూన్, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒకటిన్నర స్పూన్ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎముకలు, వెన్నెముక దృఢంగా తయారవుతాయి.. ఈ చూర్ణం తో పాటు ఉదయం మధ్యాహ్నం తినేముందు మహా రస్నాది కాషాయం తీసుకోవాలి. అలాగే ఉదయం, రాత్రి తిన్న తర్వాత ఒక గ్లాస్ నీటి లో మహాబీర విత్తనాలు నానబెట్టుకుని వాటిని నీటితో సహా తాగేయాలి. ఇలా మూడు నెలలు చూర్ణం, కషాయం తాగితే శాశ్వతంగా డిస్క్ సమస్యలు, వెన్నుముక నొప్పులు తగ్గుతాయి. అలాగే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. తక్షణ శక్తి లభిస్తుంది.


షుగర్, బిపి తో బాధపడే వారిలో కూడా డిస్క్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి షుగర్, బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి .అలాగే ఎక్కువ సేపు మెట్లు ఎక్కడం దిగడం లాంటివి చేయకుండా ఉండాలి. డిస్క్ సమస్యలతో బాధపడేవారు ఆపరేషన్ అవసరం లేకుండానే పైన చెప్పుకున్న చిట్కా ను పాటిస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి.

No comments

Powered by Blogger.