Dry Coconut benefits రోజు చిన్న ముక్క తింటే కీళ్లనొప్పులు,అలసట,నీరసం,రక్తహీనత అనేవి ఉండవు తెలుసా...?
Dry Coconut benefits
ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరి లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎండు కొబ్బరి జీర్ణం అవటానికి కాస్త సమయం పట్టినా ప్రయోజనాలు చాలా ఎక్కువ.
ఎండు కొబ్బరిని మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం వంటివి సమృద్దిగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో ఉండే సెలీనియం సేలనో అనే ప్రోటీన్స్ ను పెంచడం ద్వారా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు మెదడులో మైలీన్ అనే న్యూరో ఉత్పత్తిని పెంచి మెదడును చురుకుగా ఉంచుతుంది. మెదడులోని నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. పక్షపాతం నుండి కాపాడుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే మతి మరుపు సమస్యలు దూరం అవుతాయి.
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండుకొబ్బరి ని వాడటం వలన రక్త లేమి సమస్య తగ్గుతుంది . ఎండుకొబ్బరి తో బెల్లం కలిపి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.
No comments