Exercise: : మంచి ఆరోగ్యం కోసం రోజూ స్లో వాకింగ్ చేస్తున్నారా...?అయితే జాగ్రత్తపడండి...!!!
ఆరోగ్యంగా(healthy) ఉండటానికి నడక మంచిందంటారు. అయితే ఆ నడక ఎలా ఉండాలనేది చాలామందికి తెలియదు. బాడీ ఫిట్‌గా ఉండటానికి చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు.
జిమ్(gym)లకు వెళతారు. అలాంటి వారి శరీరం ఫిట్‌గానే ఉంటుంది. అయితే జిమ్‌లు, వ్యాయామాలు చేయలేని వారు కేవలం రన్నింగ్, వాకింగ్లపైపే ఆధారపడుతారు. ఆరోగ్యంగా ఉండాలని వాకింగ్(Walking) చేస్తారు చాలామంది. ఇదే కోవలో మార్నింగ్ వాకింగ్ చాలా మందికి ఉన్న అలవాటు. నడవడం ఒక మంచి వ్యాయామం(exercise). దీని వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. ఉదయాన్నే నిద్ర లేవడంతో దిన చర్య ప్రారంభించి పరగడుపున రెండు గ్లాసుల మంచి నీరు తాగి, కొద్ది సేపటి తరువాత కనీసం అరగంట సేపు నడవాలి. అయితే ఫాస్ట్‌గా నడిస్తే మంచిదా లేదా స్లోగా నడిస్తే (slow walk) మంచిదా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా మనం రోజూ నడిచేలా స్లో వాకింగ్(slow walking) చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందే తప్ప అద్భుతమైన ప్రయోజనాలేవీ కనిపించవు.
కొవ్వు మాత్రమే తగ్గుతుంది..
నెమ్మదైన నడక(slow walk) శరీరానికి ఉల్లాసంగా అనిపించినా దాని ప్రభావం శరీరంలోని ఇంటర్నల్ పార్ట్స్‌పై పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వేగంగా నడవడం(fast walk) వల్ల గుండె పనితీరు సక్రమంగా ఉంటుందని ఓ ఆధ్యయనంలో తేలింది. శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలే గుండెను, ఇతర అవయవాలను ఉత్తేజపరుస్తాయట. వేగంగా నడవడం వల్ల కాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోస సమస్యలు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటివి రాకుండా నివారిస్తుందని తెలిపారు.
జీవిత కాలం తక్కువే..
అలాగే స్లో వాకర్స్ లైఫ్ స్పాన్(life span) 72 ఏళ్లకు మించడం లేదట. ఫాస్ట్‌గా నడిచే వారి జీవిత కాలం మాత్రం 87 ఏళ్ల దాకా ఉంటోందట. ఈ క్రమంలోనే తక్కువగా నడిచే వారి జీవిత కాలంలో ఫాస్ట్ వాకర్స్)fast walkers)తో పోలిస్తే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్‌గా నడవడం వల్ల మనిషి జీవిత కాలాన్ని పెంచడమే కాక ఎముకలు బలంగా, మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయట.
రన్నింగ్ చేసేటపుడు..
అయితే చాలా మంది రన్నింగ్(Running) చేసేటపుడు కూడా జాగ్రత్తలు తీసుకోరు. మొదట్లోనే ఎక్కువ రన్నింగ్ చేసేయడం వల్ల బాడీ మీద ఇంపాక్ట్ గట్టిగా పడుతుంది. విశ్రాంతి అవసరాన్ని అసలు మర్చిపోకూడదు. సరిగ్గా, వార్మప్, కూల్ డౌన్ లేకపోవడం వల్ల మీ ప్రోగ్రెస్ అనుకున్నట్లుగా జరగదు. మీరు షూస్ వేసుకుని వెంటనే పరిగెత్తడం మొదలు పెట్టకూడదు. ఎనిమిది పది నిమిషాల డైనమిక్ వార్మప్, రన్నింగ్ తరువాత కూల్ డౌన్ అవడానికి కొన్ని యోగా స్ట్రెచెస్ చేయడం అవసరం. రన్నింగ్ చేసే వారెప్పుడూ వారి బాడీ ఏం చెప్తోందో వింటూ ఉండాలి. రన్నింగ్ మొదలు పెట్టేవారు వారానికి రెండు మూడు సార్లు ముప్ఫై నిమిషాలతో మొదలు పెట్టాలి.
No comments