Latest

Loading...

FASTAG : ఇకపై పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..! పార్కింగ్ గేటు దగ్గర వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు..!!.

FASTAG

 డిజిటల్‌ పేమెంట్‌ సేవల సంస్థ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో కలిసి ఫాస్టాగ్‌ ఆధారిత పార్కింగ్‌ సర్వీసులు ప్రారంభించింది


వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. కశ్మీర్‌ గేట్‌ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్‌ స్టికర్‌ గల కార్లు.. పార్కింగ్‌ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్‌ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండకుండా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.


ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్‌ పేర్కొంది. ఈ విధానం వల్ల ఫాస్టాగ్‌ ఉన్న కార్లు పార్కింగ్‌ కౌంటర్‌ వద్ద ఎలాంటి ఆలస్యం లేకుండా వెళ్లేందుకు వీలవుతుంది. కార్లతో పాటు ద్విచక్రవాహనాలకూ యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేటీఎం పేర్కొంది. జూన్‌ నాటికి పేటీఎం కోటికి పైగా ఫాస్టాగ్‌లను జారీ చేసింది. మొత్తం అన్ని బ్యాంకులూ కలిసి జూన్‌ చివరి నాటికి 3.47 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశాయి.


రానున్న రోజుల్లో షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రులు, విమానాశ్రయాల్లోని పార్కింగ్‌ స్థలాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు పలు సంస్థలతో చర్చిస్తున్నట్లు పేటీఎం వివరించింది. కాగా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో అన్ని ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. టోల్‌గేట్ల వద్దనే ఫాస్టాగ్‌ ఉండగా, ఇప్పుడు పార్కింగ్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు.

No comments

Powered by Blogger.