Latest

Loading...

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త.. మూడు నెలలు క్యాష్ బ్యాక్....!

Gas Cylinder

 Gas Cylinder: గత కొన్ని నెలల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.


ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 190 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెరగడం గమనార్హం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ఏకంగా 937 రూపాయలు చెల్లించాలి. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయల కంటే ఎక్కువ మొత్తమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.


రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ సామాన్యులకు రోజురోజుకు భారమవుతున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలలో ఒకటైన పేటీఎం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేస్తే నెలకు 900 రూపాయల చొప్పున క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.


వరుసగా మూడు నెలల పాటు ఈ విధంగా క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. పేటీఎం సంస్థ '3 పే 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్' పేరుతో ఈ ఆఫర్ ను అందిస్తుండటం గమనార్హం. అయితే గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2700 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉండటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ కస్టమర్లు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసి ఈ ఆఫర్ ను పొందవచ్చు.


పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లకు ప్రతి బుకింగ్ పై 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్స్, రివార్డ్స్ లభించే అవకాశం అయితే ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే పేటీఎం యాప్ ఓపెన్ చేసి ఎల్‌పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేసి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుని స్క్రాచ్ కార్డ్ ద్వారా క్యాష్‌బ్యాక్ ను సులభంగా పొందవచ్చు.


No comments

Powered by Blogger.