Gas subsidy వంటగ్యాస్‌కు మళ్లీ సబ్సిడీ ఇవ్వనున్నారా....?
వంటగ్యాస్ ధరలు ప్రతినెలా తడిసిమోపెడు అవుతున్నది. అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతుండటంతో గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు గ్యాస్ కు భారీ సబ్సిడీని ఇవ్వడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే, పేదలతో పాటుగా ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ సబ్సిడీని వినియోగించుకోవడంతో కేంద్రం సబ్సిడీని ఇవ్వడం నిలిపివేసింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.900 పలుకుతున్నది. కాగా, ఇప్పుడు మరోసారి కేంద్రం గ్యాస్ కు సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, అందరికీ కాకుండా, వార్షిక ఆదాయం రూ.10 లక్షలలోపున్న వారికి గ్యాస్ సబ్సిడీని ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. కేంద్రం గ్యాస్ సబ్సిడీపై నిర్ణయం తీసుకుంటే దేశంలోని కోట్లాది కుటుంబాలకు లాభం చేకూరినట్టే అవుతుంది.
No comments