Latest

Loading...

Good News అన్నదాతలకు తీపికబురు......ఇలా చేస్తే నెలకు రూ.3 వేలు....!!!

Good News

 అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో పీఎం కిసాస్ స్కీమ్ ఒకటి. ఇప్పటికే చాలా మంది ఈ పథకంలో చేరారు. ఇంకా ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరి ఉండకపోతే..


ఆన్‌లైన్‌లోనే పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేలు లభిస్తాయి. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తంగా ఏడాదికి రూ.6 వేలు వస్తాయి. ఇది కాకుండా పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే మరో పథకం కూడా ఉంది.


ఇందులో కూడా రైతులు చేరొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరితే అన్నదాతలకు ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ వస్తుంది. అంటే ఏడాదికి రూ.36 వేలు పొందొచ్చు. 60 ఏళ్ల తర్వాతి నుంచి ఈ డబ్బులు వస్తాయి.


18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు పథకంలో చేరొచ్చు. అయితే నెలకు రూ.3 వేలు కావాలంటే రైతులు నెలకు రూ.55 నుంచి 200 వరకు కడుతూ రావాలి. 18 ఏళ్లలోనే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55, 30 ఏళ్లలో చేరితే నెలకు రూ.110, 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు.


No comments

Powered by Blogger.