Latest

Loading...

Health Tips: పరగడుపున వీటిని తీసుకుంటే డేంజర్.. ఖాళీ కడుపుతో తీసుకోకూడని పదార్థాలు ఇవే.....!.

Health Tips

 ప్రతి రోజూ ఉదయం బ్రష్ చేయగానే మనం తీసుకునే డ్రింక్స్‌లో టీ లేదా కాఫీ కచ్చితంగా ఉంటాయి. మన జీవనశైలిలో ఇవి భాగంగా మారాయి.


అయితే వీటిలో ఉండే కెఫిన్‌ అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.

ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. కెఫినేటెడ్ డ్రిక్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు పరగడుపుతో తీసుకోకూడని కొన్ని డ్రింక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..


* ఆల్కహాల్ : ఆకలితో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం లేదా డ్రింక్స్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. పరగడుపున మద్యం తాగితే, శరీరం దాన్ని సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా శోషించుకుంటుందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మన శరీరం ఆల్కహాల్‌ను తొలగించే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఫలితంగా హ్యాంగోవర్‌తో పాటు గుండె, మూత్రపిండాలు, కాలేయంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.


* కాఫీ : పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ కాఫీ తీసుకోకూడదు. డీకెఫినెటెడ్ కాఫీలకు కూడా దూరంగా ఉండటం మంచిది. కాఫీ మన కడుపులో యాసిడ్స్‌ను సృష్టిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే గుండెల్లో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. బ్రేక్ ఫాస్ట్‌కు ముందే కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే.. శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతుంది.


* జంక్, బేకరీ ఫుడ్ : పొద్దున్నే జంక్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు తీసుకుంటే శరీర అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

* సిట్రస్ జాతి పండ్ల రసాలు : నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో ఫైబర్‌తో పాటు యాసిడ్స్‌ ఉంటాయి. ఖాళీ కడుపుతో ఇలాంటి పండ్ల రసాలు తీసుకుంటే కడుపులో చికాకుగా అనిపించవచ్చు. ఇది గ్యాస్ట్రిటిస్‌కు కారణమవుతుంది. ఇతర జీర్ణ సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశం ఉంది.


* చూయింగ్ గమ్ : చూయింగ్ గమ్స్ జీర్ణ రసాలను (డైజెస్టివ్ యాసిడ్స్‌) ఉత్పత్తి చేస్తాయి. ఇవి అధికమైతే, పేగుల సున్నితమైన పొరకు హాని కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే గ్యాస్ట్రిటిస్‌ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

No comments

Powered by Blogger.