Latest

Loading...

Health Tips : మేక పాలు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా....?

Health Tips


మనం ఎక్కువగా గేదెపాలు, ఆవు పాలను మాత్రమే తాగుతూ ఉంటాము. అయితే వీటిలో ఎన్నో లాభాలు ఉంటాయి కనుక వీటిని మనం అతి తక్కువ ధరకే తెచ్చుకొని తాగుతూ ఉంటాము.


అయితే ఇప్పుడు మేకపాలు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో వాటి గురించి చూద్దాం.


మేక పాలు తాగడానికి అందరూ మొహమాట పడుతూ ఉంటారు. కానీ దీని అసలు ధర ఎంతో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. మేక పాలు ధర లీటరు అక్షరాల..1500 రూపాయలట. ఇవి అంత రేటు పోవడానికి గల కారణం ఏమిటా..? అని ఆలోచిస్తున్న సమయంలో కొంతమంది తెలిపిన విషయాల ప్రకారం.. ఇవి మన దేశంలోనే ఉత్తరప్రదేశ్ లో ఇంత రేటు పలుకుతున్నాయి.


ఇక ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విషజ్వరాలు బాగా పాకి పోయాయి. ఇక ఈ జ్వరాలు ఎంత విషపూరితమో తెలియకుండా అయిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక వార్త ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. ఈ మేక పాలు తాగడం వల్ల.. ఆ పాలలో ఉండేటువంటి ప్లేట్లెస్ట్స్ లు మన శరీరానికి ఎంతో సహాయపడుతుందని ,అక్కడ ఉండేటువంటి కొంతమంది ఆయుర్వేద నిపుణులు తెలియజేయడం జరిగింది. ఇక దాంతో ఈ మేక పాలు కొనడం కోసం అక్కడున్న ప్రజలంతా క్యూ కట్టారు.


మేక పాలలో జీవక్రియలను మెరుగు పరచే అద్భుతమైన గుణాలను కలిగి ఉంటాయి. అరుగుదల సమస్య ఉన్నవారు తరచుగా మేకపాలు తీసుకోవడం మంచిది.


అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు మేక పాలను తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.


క్యాల్షియం సమస్యతో బాధపడే వారికి మేకపాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.


మేక పాలలో సెలీనియం బాగా సమృద్ధిగా లభిస్తుంది.


మన శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండడానికి, మేక పాలలో ఉండే ఆర్గానిక్ సోడియం కీళ్ళ కదలికలకు బాగా ఉపయోగపడుతుంది.


శరీరంలో ఏర్పడేటువంటి చీము, అలర్జీల నుండి విముక్తి కలిగిస్తుంది. అంతే కాదు అందానికి కూడా ఈ మేక పాలు చాలా బాగా పనిచేస్తాయి.

No comments

Powered by Blogger.