Health tips ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తిన్నారంటే.. ...ఏ అనారోగ్య సమస్య దరిచేరదు....!
వెల్లుల్లిని నిత్యం మనం ఎన్నో రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అలాగే తేనె కూడా దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది.
దీన్ని రోజూ తీసుకుంటారు. కానీ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని పరగడుపునే తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని పొట్టు తీసి దంచాలి. కొద్దిగా నూరి ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తేనెకు కలిపి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తినరాదు. ఈ మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని పై విధంగా తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్‌తోపాటు కొవ్వు కరుగుతుంది.
2. వెల్లుల్లి, తేనెల్లో అద్భుతమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. హైబీపీ సమస్య ఉన్నవారు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
5. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే త్వరగా వాటి నుంచి బయట పడవచ్చు.
No comments