Latest

Loading...

Health tips: తిమ్మిర్లు వస్తున్నాయా...?అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే....లేకపోతే భవిష్యత్తులో రోగాలు రావచ్చు....!!!.

Health tips

 చాలామందిని తిమ్మిర్ల (cramps) సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కొంతమందికి తరచుగా తిమ్మిర్లు వస్తుంటాయి. తరచుగా తిమ్మిర్లు వస్తే నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఎక్కువ సమయం కాళ్లు (legs), చేతులను కదపని పక్షంలో తిమ్మిర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తరచూ వచ్చే తిమ్మిర్లపై దృష్టి పెట్టని పక్షంలో అనేక ఆరోగ్య సమస్యలు (health problems) సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. నరాలు (nerves) ఒత్తిడికి గురైనప్పుడు శరీరం తిమ్మిర్లు (cramps) రూపంలో సంకేతాలిస్తుంది. ఒక్కోసారి ఆ చోట స్పర్శ (touch) కూడా తెలీదు. తిమ్మిర్లు అన్నీ ఒకే రకమైనవిగా భావించకూడదు. వీటిలో కూడా తేడాలు ఉంటాయి. ఎక్కువ సేపు కదలకుండా కుర్చున్నప్పుడు సూదులతో గుచ్చుతున్నట్లుగా ఉండటం, మంటలు ఏర్పడటాన్ని పాజిటీవ్ తిమ్మిర్లుగా పేర్కొంటారు. నెగటివ్ తిమ్మిర్లు దీర్ఘకాలికంగా వేధిస్తాయి. ఇవి ఎక్కువ నొప్పి (pain) పెడతాయి. ఈ తిమ్మిర్ల వల్ల స్పర్శ (touch) కూడా కోల్పోతారు. ఈ సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.


మధుమేహం (డయాబెటీస్) రోగుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడుతుంటాయి. వీరు నిత్యం అరికాళ్ల మంటలతో బాధపడతారు. నడవకపోయినా సరే.. కార్లు నొప్పి (pain) పెడతుంటాయి. సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. ఈ తిమ్మిర్లు (cramps) ఒక్కసారి నరకాన్ని చూపిస్తాయి. మధుమేహం ప్రారంభంలో ఈ తిమ్మిర్లు కాళ్లకే (legs) పరిమితమవుతాయి. వ్యాధి ముదిరేకొద్ది తిమ్మిర్లు (cramps) అన్ని అవయవాలకు పాకేస్తాయి. శరీరం మొత్తం మంటగా అనిపిస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.


పక్షవాతం రావచ్చు..


కొన్ని తిమ్మిర్లు (cramps) క్రమేనా పక్షవాతానికి దారితీయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 'ఫ్యాబ్రిస్' అనే వ్యాధి కలిగినవారిలో మొదట శరీరంలో తిమ్మిర్లు ఏర్పడతాయి. చర్మంపై (skin) మచ్చలు (పిగ్మేంటేషన్) ఏర్పడతాయి. ఆ తిమ్మిర్లు క్రమేనా ముదిరి పక్షవాతానికి దారితీస్తాయి. ఈ సమస్య మధుమేహ (diabetic) రోగుల్లో కూడా ఎక్కువే.


శరీరాన్ని ఎక్కువ సేపు కదల్చనప్పుడే తిమ్మిర్లనేవి ఏర్పడుతుంటాయి. తిమ్మిర్లు తగ్గించుకోడానికి వ్యాయమం, యోగా ఒక్కటే సరైన మందు. లాక్‌డౌన్ వల్ల వర్క్‌ ఫ్రం హోమ్ చేస్తున్నవారు తప్పకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి ఐదు నుంచి పది నిమిషాలు నడవాలి. ఎక్కువ సేపు టైప్ చేసేవాళ్లు, కంప్యూటర్లలో డాక్యుమెంటేషన్ చేసేవాళ్లు.. వేళ్లకు అప్పుడప్పుడు విశ్రాంతినివ్వాలి. లేదా వేళ్లకు ప్యాడ్స్ వంటివి ధరించైనా పని చేయాలి. ఎక్కువ దూరాలు ప్రయాణించేవారు లేదా వాహనాలను నడిపేవారు కనీసం రెండు గంటలకు ఒకసారైన విశ్రాంతి తీసుకోవాలి. వాహనం దిగి కాసేపు నడవాలి. ఎక్కువ బిగుతుగా ఉండే షూ లేదా చెప్పులు ధరించినా తిమ్మిర్లు పుడతాయి. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి.. వీలైనంత వదులైన షూలే వేసుకోండి


No comments

Powered by Blogger.