Health tips: ఈ ఒక్క పదార్థం మన రోజువారి ఆహారంలో తీసుకుంటే లాభాలు అనేకం.. ...అది ఏమిటో చూద్దామా...
శాఖాహారులు (vegetarians) మంచి ఆరోగ్యంగా (healthy) ఉంటారనేది వాస్తవం. ఎందుకంటే మిగతా ఆహార పదార్థాల (food items)తో పోలిస్తే శాఖాహారంలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి.
అయితే ఈ శాఖ హారంలో సోయా(Soya) గురించి ఎప్పుడైనా విన్నారా?. ఈ ఒక్క సోయాలో ఉన్న ప్రోటీన్స్, పైబర్లు మనం ఆరోగ్యంగా(healthy) ఉంచడానికి ఎంతో తోడ్పడతాయట. మొక్కల నుంచి వచ్చే ఆహారం(food) చాలా మంచిది. ముఖ్యంగా ఫైబర్ వాటి ద్వారా మనకు అందుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ డైట్(diet)లో ఫైబర్ ని ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్స్‌ని కూడా డైట్‌లో తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి (Immunity system) పెరుగుతుంది. అంతే కానీ డైట్‌లో ఇవి లేకుండా తీసుకుంటే మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అధికంగా ఫైబర్, ప్రోటీన్స్ మనకి సొయా ఫుడ్స్‌లో దొరుకుతాయి. అయితే ఈ సోయా ఎంతవరకు మనకు ఉపయోగ పడుతాయో ఒకసారి తెలుసుకుందాం.
లాభాలు..
సోయా పిండి, సోయా పాలు మొదలైన వాటి ద్వారా మంచి బెనిఫిట్స్ (benefits) కలుగుతాయి. సోయా బీన్స్‌లో 31 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అయితే ఇవి అనవసరం అనుకుంటే పొరపాటు ఇవి చాలా అవసరమైనవి. ఇలా దీని వల్ల మనం నష్టాలు కాదు కేవలం ప్రయోజనాలు పొందగలము. ఇందులో ఐరన్ (Iron) కూడా అధికంగా ఉంటుంది. సోయాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అదే విధంగా ఇందులో ప్రోటీన్స్ (Proteins) కూడా అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా సోయా ద్వారా మనం పొందొచ్చు. సోయాలో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలో లాక్టోస్, కాల్షియం కూడా ఉంటుంది. ఇలా ఈ విధంగా సొయా ద్వారా మనం బెనిఫిట్స్ పొందవచ్చు.
సోయా ఫుడ్‌లో కాల్షియం (Calcium) అధిక మోతాదులో ఉంటుంది. ఎవరికైనా ఒకవేళ క్యాల్షియం డెఫిషియెన్సీ ఉంటే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. సోయా ప్రాసెస్ చేస్తారు కాబట్టి దానిలో ఉండే క్యాల్షియం తగ్గిపోతుంది. యాంటీ న్యూట్రియన్స్, పల్స్ మనకి సోయాతో లభిస్తాయి. ఫైబర్ (Fiber) కూడా దొరుకుతుంది. ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, మినరల్స్ దీనిలో ఎక్కువగా ఉంటాయి.
ఈ ప్రోటీన్స్‌ని పిల్లలు పెద్దలు కూడా తీసుకోవచ్చు. మామూలుగా మాంసంలో ఉన్నట్లు ఇందులో కూడా ప్రోటీన్స్ వుంటాయి. అంటే దీని ద్వారా పాలలో ఉండే ప్రోటీన్‌లతో సమానంగా సోయా మనకి ఇస్తుంది. సోయా బీన్స్ ద్వారా మనం మంచి ప్రోటీన్స్‌ని అందుకోగలం. సోయాబీన్ నూనె (Oil) కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది. వంటల్లో కూడా మనం దీనిని ఉపయోగించవచ్చు. అదే విధంగా కొవ్వు లేకుండా ఉండే టోఫు, కొవ్వు లేకుండా ఉండే పాలు కూడా మనకి దొరుకుతుంటాయి. వీటిని కూడా మనం కొనుగోలు చేసి వాడొచ్చు.
No comments