Latest

Loading...

Home remedies for Cold, Flu : దగ్గు, జలుబు చిటికెలో మాయం చేసే వంటింటి చిట్కాలు....!!

Home remedies for Cold, Flu

 Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు చిటికెలో మాయం చేసేందుకు కొన్ని వంటింటి చిట్కాలు ఎంతో బాగా పని చేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో జలుబు, (Cold) దగ్గులాంటి (cough) సమస్యల బారిన అందరూ పడుతుంటారు.


చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ సీజనల్‌పరంగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరి దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే దగ్గు, జలుబుతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అయితే వీటిని బారిన పడితే కరోనా (Corona) సోకిందా అనే అనుమానం మరింత కలవరానికి గురి చేస్తోంది.


వంటింటి చిట్కాలతో మంచి వైద్యం


దగ్గు, జలుబు వచ్చిన వెంటనే కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటిస్తే చాలా మేలు. మంచి ఫలితం ఉంటుంది. వంటింటిలోని (Kitchen) కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టుకోవడం, గార్గిల్‌ చేయడం వంటి వాటి వల్ల వెంటనే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఒకసారి చూద్దాం.


* ఒక టీస్పూన్‌ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.


* రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలి. 

* ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ, కివీ మొదలైన పుల్లటి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

* ఒక లీటరు నీటిలో 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్‌ చొప్పున వాము, మెంతులు, పసుపు, 4-5 నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.


* స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించద్దు.

 * జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.

 * ఏమైనా గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది.

 * సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్‌టీలు తాగండి.


* గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.

 * గొంతునొప్పి వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్‌ చేయాలి. * తులసి ఆకులు నమలాలి. 


 వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి.


వీలైనంతవరకు తేలికగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యమివ్వండి. సో... చూశారుగా... తరచుగా వేధించే జలుబు, దగ్గు సమస్యల నుంచి ఎలా బయటపడాలో..మరి మీరు కూడా ఈ వంటింటి చిట్కాలను పాటించండి. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

No comments

Powered by Blogger.