Hybrid Kidney డయాలసిస్ రోగులకు శుభవార్త హైబ్రిడ్ కిడ్నీ రాబోతుందా.....?
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎంతోమంది డయాలసిస్ తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో రోజురోజుకీ అనేకం పెరుగుతున్నాయని చెప్పవచ్చు.
మనదేశంలోనూ, ప్రపంచంలోనే ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా అవుతోంది. దీర్ఘ కాలికమైన మూత్రపిండాల యొక్క వ్యాధి కి డయాలసిస్ చేసి మానవ శరీరంలోని మలినాలను తొలగించుకునే పక్రియ చేపడతారు. ఈ యొక్క డయాలసిస్ ప్రక్రియ చాలా ఇబ్బందికరమైన పద్ధతే కానీ, కొద్దిగా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇటువంటి ఈ సమస్యకు త్వరలో స్వస్తి పలికే సమయం వచ్చేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొలది దీనికి స్వస్తి చెప్పాలని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుత్రిమ కిడ్నీలను డెవలప్ చేస్తుండగా వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని వారు తెలియజేస్తున్నారు.
సిలికాన్ ప్రింటర్ తో పాటుగా సజీవమైన టువంటి రెనాల్ కణాలతో కూడినటువంటి ఈ యొక్క హైబ్రిడ్ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధంగా చేశారు. ఇప్పటి వరకే దీనికి సంబంధించిన ప్రయోగాలు కూడా విజయవంతం అవగా, ఇది కిడ్నీ యొక్క వ్యవస్థను అనుసంధాన పరిచి శరీరంలోనే ఉంచేటువంటి తక్కువ సైజు ఈ హైబ్రిడ్ కిడ్నీ.. ఈ యొక్క కిడ్నీ ఒకసారి మన శరీరంలో అమర్చుకుంటే, ఇప్పుడు కూడా బ్యాటరీ అవసరం లేకుండానే శరీరంలో రక్తం ప్రవహించి ఒత్తిడితోనే మలినాలను తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. ఇది శరీరం యొక్క వ్యవస్థను వ్యతిరేక పరచకుండా ఉంచడం కోసం ఎలాంటి మందులు వాడవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీనిని ద కిడ్నీ ప్రాజెక్ట్ పేరుతో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలతో అరచేతిలో ఇమిడిపోయే అటువంటి చిన్న సైజు యంత్రం తయారయిందని, కంప్యూటర్ చిప్పుల తయారీలో ఉపయోగించే అటువంటి సిలికాన్ అతి సూక్ష్మమైన అటువంటి రంధ్రాలు ఉన్న వారు తయారు చేసినట్టు తెలిపారు. దీనిలో 2 ప్రత్యేక దమనులను యొక్క హైబ్రిడ్ కిడ్నీ అనుసంధాన పరిచి, శుద్ధి చేయవలసిన రక్తం ఒక గొట్టం ద్వారా దీనిలోకి ప్రవేశపెడతారు. ఇందులో శుద్ధి చేసినటువంటి రక్తం మరొక ధమని ద్వారా శరీరంలో చేరిపోతుంది. ఇందులో వచ్చిన వ్యర్థాలన్ని మూత్రాశయానికి పంపించి బయటకు వెళ్లిపోతాయి.
No comments