Latest

Loading...

Immunity యాంటీబాడీలు తగ్గినా.....ఇమ్యూనిటీ కాపాడ్తది.....!!!

Immunity

 కరోనా టీకాలు తీసుకున్నోళ్లకు ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గిపోతాయి.


ఆ తర్వాత వైరస్ సోకితే మనకు రక్షణ ఉంటుందన్న గ్యారంటీ లేదు. డెల్టా వంటి వేరియంట్లపై రెండు డోసులతో పెద్దగా ఫలితం ఉంటలేదు. అందుకే.. ఆరు నెలల తర్వాత బూస్టర్ (థర్డ్) డోస్ టీకాలను ఇవ్వాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, కరోనాకు వ్యతిరేకంగా మన శరీరంలో ఏర్పడిన యాంటీబాడీలు తగ్గిపోయినా.. ఇమ్యూన్ సిస్టమ్ కు బ్యాకప్ ప్లాన్ ఉంటుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​పెన్ సిల్వేనియా సైంటిస్టులు వెల్లడించారు. మన ఇమ్యూన్ సిస్టమ్ మెమరీ బీ, టీ సెల్స్ తో వైరస్ కు చెక్ పెడుతోందని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకున్న 61 మందిపై రీసెర్చ్ చేయగా.. ఇమ్యూన్ సిస్టమ్ కు బ్యాకప్ ప్లాన్ ఉన్న సంగతి తెలిసిందని వారు పేర్కొన్నారు.


బీ, టీ సెల్స్ తో బ్యాకప్ ప్లాన్


కరోనా వైరస్ లు ముందుగా నోరు, ముక్కు లోపల తడిగా ఉండే మ్యూకస్ పొరలకు అతుక్కుని, ఆ తర్వాత లంగ్స్ లోకి ఎంటరవుతాయి. వ్యాక్సిన్ లు తీసుకున్నోళ్లు లేదా ఆల్రెడీ కరోనా బారిన పడి కోలుకున్నోళ్లలో వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఏర్పడతాయి కాబట్టి.. అవి నోరు, గొంతులోనే వైరస్ ను అడ్డుకుంటాయి. కానీ శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోయిన తర్వాత.. వైరస్ సోకితే ఇన్ఫెక్షన్ కు గురయ్యే చాన్స్ పెరుగుతుంది. మళ్లీ కొత్త యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేదాకా ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతుంది. అందుకే కొత్త యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు బూస్టర్ డోస్ లు వేయాలని చెప్తున్నారు. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్ డోస్ ల కోసం ఎదురు చూడటం లేదని, అది తన మెమరీ పవర్ తో వైరస్ ను అడ్డుకుంటోందని అమెరికన్ సైంటిస్టులు వెల్లడించారు. మెమరీ బీ, టీ సెల్స్ రూపంలో అది బ్యాకప్ ప్లాన్ ను అమలు చేస్తోందని తెలిపారు.


61 మందిపై స్టడీ..


మోడెర్నా, ఫైజర్, బయోఎన్ టెక్ కంపెనీలు తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకున్న 61 మందిని సైంటిస్టులు ఆరు నెలల పాటు ట్రాక్ చేశారు. రోజులు గడుస్తున్నకొద్దీ అందరిలోనూ యాంటీబాడీలు క్రమంగా తగ్గాయి. కానీ టీకాలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ ను బీ, టీ సెల్స్ రూపంలో ఇమ్యూన్ సిస్టం గుర్తుపెట్టుకునే కాలం పెరిగినట్లు గుర్తించారు. దీంతో యాంటీబాడీలు తగ్గినా.. బీ, టీ సెల్స్ ద్వారా వైరస్ ను గుర్తించి ఇమ్యూన్ సిస్టమ్ అడ్డుకుంటోందని, దీంతో సీరియస్ కండీషన్ లోకి వెళ్లే ప్రమాదం తప్పుతున్నట్లు గుర్తించారు.


బీ, టీ సెల్స్ ఎట్ల పనిచేస్తయ్...?


ఇవి రెండూ తెల్ల రక్తకణాలే. శరీరంలోకి ఎంటరయ్యే వైరస్ లేదా బ్యాక్టీరియా కణాలపై ఉండే యాంటీజెన్ లకు బీ సెల్స్ అతుక్కుంటాయి. టీ సెల్స్ మాత్రం మన శరీర కణాలకు సోకిన వైరస్ లేదా బ్యాక్టీరియాలపై యాంటీజెన్ లకు మాత్రమే అతుక్కుంటాయి. బీ, టీ సెల్స్ ఇలా యాంటీజెన్ లకు అతుక్కున్న తర్వాత సంబంధిత వైరస్ లేదా బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా కిల్లర్ సెల్స్ ఏర్పడి హతమారుస్తాయి. అలాగే వీటిని గుర్తు పెట్టుకునేందుకు కొత్తగా మెమరీ సెల్స్ కూడా పుడతాయి. ఎంఆర్ఎన్ఏ టీకాలు తీసుకున్నోళ్లలో ఆరు నెలల తర్వాత మెమరీ బీ సెల్స్ తో పాటు మెమరీ టీ సెల్స్ కూడా ఏర్పడినట్లు సైంటిస్టులు గుర్తించారు. బీ సెల్స్ కు అదనంగా ఇవి మరో రక్షణ కవచంలా మనల్ని కాపాడతాయని తెలిపారు.


టీకాలతోనే చాలా మేలు


కరోనా తీవ్రతను తగ్గించేందుకు, దవాఖానల పాలు కాకుండా ఉండేందుకు టీకాలు ఎంత ముఖ్యమో.. తమ రీసెర్చ్ తెలియజేసిందని యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజీ విభాగం డైరెక్టర్ జాన్ వీరీ చెప్పారు. మెమరీ బీ, టీ సెల్స్.. కరోనా సింప్టమ్స్ త్వరగా తగ్గేందుకు, పరిస్థితి సీరియస్ కాకుండా అడ్డుకునేందుకు, వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలను తగ్గించేందుకు దోహదం చేస్తాయన్నారు. అందుకే టీకాలు వేసుకోవడం అత్యంత అవసరమన్నారు. ''కొన్నాళ్లకు యాంటీబాడీలు తగ్గిపోతాయి. మీకు స్వల్ప ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ బీ, టీ సెల్స్ వెంటనే రెస్పాండ్ అయి కొత్త న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేసి రక్షిస్తాయి' అని ఆయన పేర్కొన్నారు.

No comments

Powered by Blogger.