Indigestion అజీర్ణం సమస్య మిమ్మల్ని వేదిస్తుందా..... అయితే ఇలా చేసి చూడండి...!!
ఆఫీస్ వర్క్ ప్రెషర్, లేట్ నైట్ పార్టీస్, గంటల తరబడి ఫోన్ లేదా సిస్టం ముందు అతుక్కుపోవడం. దీంతో వేళ తప్పిన ఆహారం ఫలితంగా తిన్న ఆహారం జీర్ణం అవక అనేక అనారోగ్య సమస్యలు.
అయితే అజీర్తి సమస్య గనుక మిమ్మల్ని వేదిస్తున్నట్టు అయితే ఈ అయుర్వెదపు చిట్కాలు పాటించి ఈ సమస్య నుండి ఉపశమనం పొందండి.
* శంఖభస్మము, శొంఠి చూర్ణము ఈ రెండింటిని సమభాగములుగా కలిపి మరిగించి పూటకు అణా ఎత్తు (తులము లో పదహారవ వంతు) చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా మంచినీటితో కలిపి తీసుకుంటే అన్ని రకముల అజీర్ణము హరించును.
* ద్రాక్షపండ్లు, కరక్కాయ పెచ్చులు ఈ రెండిటిని సమభాగాములుగా కలిపి తేనెలో నూరి ఉసిరికాయలంతా మాత్రలు చేసి, పూటకు ఒక మాత్ర చొప్పున రోజు రెండు పూటలా వేడి నీటితో తీసుకొంటే అన్ని రకములైన అజీర్ణములు హరించును.
* రాతి సున్నము 2 గురిగింజలెత్తు, అల్లపూరసము అరతులము, ఈ రెండింటిని కలిపి ; నూరి ఒక మోతాదుగా తాగాలి.
ఇలా ప్రతి నిత్యము ఉదయాన్నే తినిన ఆహారం చక్కగా జీర్ణమై, మంచి ఆకలి కలుగును. రాతి సున్నము శుద్ధిచేసి వాడాలి. ఉప్పు నీళ్లతో నూరి ఎండబెడితే శుద్ధి అవుతుంది.
* ఒక తులము ఈశ్వరివేరు పైపట్టును వేడి నీటితో నూరి ఉదయాన్నే తాగాలి.
ఇలా వారమురోజులపాటు త్రాగితే సకల అజీర్ణము లు హరింస్థాయి.
* సొంటి బెల్లములను కలిపి నూరిన చూర్ణమును తిన్నా లేదా నీటిలో ఉప్పు కలిపి త్రాగిన అజీర్ణము తగ్గుతుంది.
* ఉదయం పూట నిద్ర లేవగానే కడుపునిండుగా మంచినీటిని త్రాగుతూ ఉంటే కారు త్రేపులు, కడుపుబ్బరముగల అజీర్ణము తగ్గుతుంది.
* శొంఠి, జీలకర్ర, వాము, పిప్పళ్ళు, ఇవి ఒక్కొక్కటి ఐదేసి తులముల చొప్పున తీసుకుని పొడి చేయాలి. ఈ మొత్తము పొడితో సమముగా బెల్లమును కలిపి, ఈ మిశ్రమము పూటకు ఒక తులము చొప్పున రోజు రెండు పూటలా తీసుకుంటే అజీర్ణము హరించును.
* వస చూర్ణము బేడెత్తు, సైంధవలవణ చూర్ణము పావుతులము ఈ రెండిటినీ వేడి నీటిలో కలుపుకుని ; త్రాగి తరువాత శొంఠి, ధనియమలను కలిపి కాచిన కషాయము త్రాగిన ఎడల అజీర్ణము పూర్తిగా హరించును
. * ఇంగువ, శొంఠి పిప్పళ్ళు, మిరియములు, సైంధవలవణము, ఈ వస్తువులను సమముగా కలిపి ; నీటితో నూరి,పగలు రోగి యొక్క కడుపుమీద లేపనముగా వ్రాసి నిద్రింప చేసిన సకల అజీర్ణములు వెనుతిరుగును.
No comments