Jagananna Vidya Deevena: హైకోర్టు ఆదేశాలపై ఇలా ముందుకు.. విద్యాదీవెనపై సీఎం జగన్ నిర్ణయం....?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకానికి (Jagananna Vidya Deevena Scheme) సంబంధించిన నగదును నేరుగా కాలేజీలకు చెల్లించాలంటూ ఇటీవల హైకోర్టు (AP High Court) ఆదేశించిన సంగతి తెలిసిందే
ఐతే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan ReddY) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education Minister Adimulapu Suresh), ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. కోర్టు ఆదేశాలను పునఃసమీక్షించాలని రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. పథకం అమలుకు సంబంధించిన పూర్తి సమాచారంతో త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యాదీవెన పథకాన్ని యాథతథంగా అమలు చేసేందుకు అనుమతివ్వాల్సిందిగా కోరతామన్నారాయన.
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగానే విద్యార్థులకు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ఫీజులను నిర్ణయించిన తర్వాత నాలుగు విడతల్లో చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. పథకం అమలులో పారదర్శక కోసమే జగనన్న విద్యాదీవెన సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లి తమ పిల్లల చదువుల గురించి తెలుసుకునే అవకాశముంటుందన్నారు.
ఇలాగే ఇంటర్మీడియట్ ఆన్ లైన్ అడ్మిషన్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా మంత్రి స్పందించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా తమకు అందలేదని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆన్ లైన్ అడ్మిషన్లు చేపట్టామని.. దీని ద్వారా విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు రావడంతో పాటు ఫీజులు, రిజర్వేషన్ల సదుపాయలను సులభంగా పొందే అవకాశముంటున్నారు. గత ఏడాది కూడా అడ్మిషన్లు ఆన్ లైన్లోనే చేపట్టినట్లు గుర్తు చేసిన మంత్రి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోర్టుకు సమర్పించి.. ఆన్ లైన్ అడ్మిషన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరతామన్నారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్నితల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలంటూ కృష్ణ దేవరాయ విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌ర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇకపై విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
ఇక ఇంటర్మీడియట్ ఆన్ లైన్ అడ్మిషన్లను రద్దు చేయాలంటూ జూనియర్ కాలేజీల అసోషియేషన్, విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆఫ్ లైన్లోనే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశించింది
No comments