Jobs in AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.....10 లక్షల ఉద్యోగాలు.
Jobs in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు నిర్ణయించుకుంది
దీంతో వాటిని బలోపేతం చేసే దిశగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు వాటిని పట్టించుకోకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిందని గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న పరిశ్రమలను ఆదుకోవాలని భావిస్తోంది. దీని కోసం నేడు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు చొరవ చూపుతున్నాయి. 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతోనే రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ ల కోసం పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని సమాచారం. గతంలో చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు పట్టు లేకపోవడంతోనే ముందుకు రాలేదని తెలుస్తోంది.
కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ పార్క్ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయతీలు అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ర్టంలో పరిశ్రమల మనుగడ కష్టసాధ్యంగా మారుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలు మూతపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలు అందజేస్తోంది.
గత మేలో రాస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1100 కోట్ల ప్యాకేజీని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. జగన్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి తనవంతు సాయం చేస్తున్నారు. దీంతో ఔత్సాహికులు ముందుకు వస్తే పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్రంలో పరిశ్రమల బలోపేతానికి తనదైన శైలిలో మద్దతు ఇస్తున్నారు.
No comments