Joint Pains Home Remedies. కీళ్ల నుంచి టక్ టక్ శబ్దం వస్తుందా. అయితే జాగ్రత్త పడాల్సిందే...!!
నడుస్తున్నప్పుడు కీళ్ల మధ్య శబ్దం వచ్చింది అంటే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రావటానికి ఇది ఒక సూచన అని చెప్పవచ్చు ఈ సూచనను అసలు అశ్రద్ధ చేయకూడదు.
మోకాళ్ళ కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ విధంగా శబ్దం వస్తూ ఉంటుంది.ఈ విధంగా శబ్ధం రావటం ప్రారంభం కాగానే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే కీళ్ల మధ్య గుజ్జు పెరగడమే కాకుండా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది
ఒక గ్లాసు పాలలో రెండు చిటికెల పసుపును వేసి ప్రతిరోజు తాగాలి పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులను వాపులను తగ్గిస్తుంది. అలాగే పాలలో ఉండే పోషకాలు కూడా ఎముకలకు బలాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి.
వేపిన శెనగలు కూడా ప్రతిరోజూ తింటుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మూడింటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కీళ్ల మధ్య గుజ్జు పెరగడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
No comments