Latest

Loading...

Joint pains Home Remedies ఈ గింజలు వాడితే చాలు. కీళ్లలో గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు అనేవి అస్సలు ఉండవు....!!

Joint pains Home Remedies

 Joint pains Home Remedies In Telugu :

చింతపండును మనం ప్రతిరోజు వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండులో ఉండే గింజలు నల్లని రంగులో మెరుస్తూ ఉంటాయి.



చింతపండు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.


ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి చింత గింజలను సిఫార్సు చేస్తున్నారు. చింత గింజలను వేగించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి.ని నిల్వ చేసుకోవచ్చు. చింతగింజల పొడి కూడా మార్కెట్ లో లభ్యం అవుతుంది.


ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర స్పూన్ పొడి మూడు నెలల పాటు తీసుకుంటే కీళ్లలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటివి అన్ని తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. రక్తంలో కొవ్వు అడ్డుపడకుండా చింత గింజలు సహాయపడతాయి ఈ గింజలలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు.


డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేయడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

No comments

Powered by Blogger.