Joints health కీళ్లలో శబ్దాలు ఎందుకు వస్తాయో తెలుసా...?
కొందరికి చేతి వేళ్లు విరిచేటప్పుడే కాదు మోకీళ్లు, భుజాల కీళ్లు కూడా చిటుక్కుమంటూ ఉంటాయి. ఇందుకు కారణం ఏంటంటే...
కీళ్ల చుట్టూ ఉండే ద్రవంలో గాలి బుడగలు ఏర్పడడం, లిగమెంట్లు, టెండాన్లు సాగుతూ, కుంచించుకుపోతూ ఉండడం ఈ శబ్దాలకు కారణం.
అలాగే ఒకే కీలును పదే పదే కదిలించినా ఇలాంటి శబ్దాలు మొదలవుతూ ఉంటాయి. ఉదాహరణకు జిమ్‌లో షోల్డర్ ప్రెస్ వ్యాయామం చేసేటప్పుడు, భుజంలో చిటుక్కుమనే శబ్దాలు వెలువడతాయి. అలాగే వ్యాయామానికి ముందు, తర్వాత చేసే స్ట్రెచింగ్ సమయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.
అలాగే కీలుకు దెబ్బ తగిలినప్పుడు, లిగమెంట్ సరైన క్రమంలో మానకపోయినా, కీలు కదిలించిన ప్రతిసారీ క్లిక్ అనే శబ్దం వెలువడుతుంది. వయసు పైబడే కొద్దీ మృదులాస్థి అరిగిపోయినా కీళ్లు శబ్దం చేయడం మొదలుపెడతాయి. అయితే కీలును కదిలించేటప్పుడు అసౌకర్యం కలుగుతూ ఉన్నా, శబ్దంతో పాటు వాపు, నొప్పి ఇబ్బంది పెడుతున్నా వెంటనే వైద్యులను కలవాలి. ఈ రకమైన సమస్యలకు లిగమెంట్ లేదా కీలు డ్యామేజీ కారణం అయి ఉండే అవకాశం ఉంది.
No comments