Life Span: వీటిని తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే.....!!
Life Span: నేటి ఆధునిక జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న చిన్న వయస్సులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. దీని వలన మన లైఫ్ స్పాన్ త్వరగా తగ్గిపోతుంది..
అయితే మన జీవిత కాలం పొడిగించుకునేందుకు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఎక్కువ కాలం హాయిగా బ్రతికేయొచ్చు.. నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. ఎటువంటి ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుందో చూద్దాం.
these items increase Life Span:
చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారుండరు.. చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుంది.. అదేంటి పిల్లల్ని చాక్లెట్స్ తినవద్దు అంటారు.. మరేంటి చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుంది అని అనుకుంటున్నారా.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో చాక్లెట్స్ తింటే ఆయుష్షు పెరగడానికి దోహదపడతాయని వెల్లడైంది. ఇక ఎంచక్కా మీరు ఒక చాక్లెట్ లాగించేయండి.. అలాగే గ్రీన్ టీ కూడా జీవిత కాలం పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగడం, కోకో ఎక్కువగా ఉన్నవి తీసుకోవడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. సర్కోపెనియా అనేది కండ మాస్క్ తగ్గడం వల్ల వస్తుంది 15 నుండి 30 శాతం మంది పెద్ద వాళ్ళలో ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా 80 సంవత్సరాల కంటే ఎక్కువ. వయస్సు ఉన్న వారిలో ఇది 11 నుండి 50 శాతం వరకు ఉంటుంది. అయితే వాళ్లలో ఫిజికల్ ఫర్ఫార్మెన్స్ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే అంటున్నారు పరిశోధకులు. దీనివలన నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ల మీద పడుతుందని లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి ఆరోగ్య సమస్యలు దరి చేరడానికి ఇదే కారణం అని తెలుస్తోంది.
ఇటీవల జనరల్ ఏజింగ్ లో పబ్లిష్ అయిన దాని ప్రకారం, చూసుకుంటే గ్రీన్ టీ లేదా కోకో లో ఉండే ఫ్లేవనాయిడ్స్ వలన ఇబ్బందులు తగ్గుతాయని, మనిషి యొక్క జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని డైట్లో భాగం చేసుకోవడం వలన అనేక లాభాలు కలుగుతాయి అంటున్నారు. ఫ్లేవనోయిడ్స్ డైట్ లో తీసుకోవడం వలన వయసు వలన వచ్చే సంబంధం సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా జీవితకాలం పెంపొందించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. పెద్ద వయసు ఉన్న వారు వారి జీవిత కాలాన్ని పొడిగించుకునేందుకు ప్రతిరోజు ఒక చాక్లెట్ అలాగే గ్రీన్ టీ, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీటిని వారే కాకుండా అన్ని వయసుల వారు తీసుకుంటే ముందు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన వారవుతారు.
No comments