Migraine Headache: మందులేని మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టండిలా..!!
తలలోని రక్తనాళాలు మీద ఒత్తిడి తో మొదలయ్యే మైగ్రేన్ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి.. తలలో ఒక వైపు మాత్రమే ఉంది కాబట్టి నొప్పి అని కూడా అంటారు. తరచుగా వచ్చే నొప్పి తీవ్రత ఒక స్థాయి నుంచి తీవ్రంగా ఉండే వరకు వెళ్తుంది.. మైగ్రేన్ తలనొప్పికి సరైన చికిత్స లేదు.. అయితే ఈ వ్యాధికి గల కారణాలు తెలుసుకొని వాటికి ఇంటి చిట్కాల తో చెక్ పెట్టవచ్చు..!! ఆ చిట్కాలేంటో చూద్దాం..!!
Migraine Headache: మైగ్రేన్ లక్షణాలు..!!
పురుషులలో కంటే మహిళలు మూడు రెట్లు ఎక్కువగా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇది నాలుగు గంటల నుంచి 72 గంటల పాటు వేధిస్తుంది. ఒక వైపు మాత్రమే ఈ తలనొప్పి ఉంటుంది. అనవసరపు ఆలోచనలతో గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారిలో ఈ సమస్య వస్తుంది. సరిగ్గా నిద్రపోక పోయినా, ఎక్కువ సేపు ఎండలో కూర్చున్న, డిప్రెషన్, మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులకు లోనైనా, ఎక్కువ దూరం ప్రయాణించిన, చికాకు, మానసిక స్థితి సరిగా లేకపోయినా మైగ్రేన్ తల నొప్పి వస్తుంది. చిరాకు, కోపం, వికారం, వెలుతురులో ఉండాలని అనిపించకపోవడం, చిన్న చిన్న శబ్దాలకు కూడా చిరాకు పడటం, కోపం త్వరగా రావడం, ఒంటరిగా, ప్రశాంతంగా ఉండాలని అనిపించడం దీని లక్షణాలు. వంశపారంపర్యంగా కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
Migraine Headache: వంటింటి చిట్కాలతో మైగ్రేన్ కు చెక్ పెట్టండి..!!
ఈ సమస్యను జీవనశైలిలో మార్పుల వలన, ఇంటి చిట్కాలు వలన మాత్రమే తగ్గించుకోగలం. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చటి నూనెతో ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. తలలో ఉన్న నరాలకు స్వాంతన కలిగి రిలీఫ్ ను అందిస్తుంది. అలాగే మరో ఇంటి చిట్కా ను చూద్దాం. పెప్పర్మింట్ ఆయిల్, బాదం నూనె, గంధం పొడి, రోజ్ వాటర్ ఈ చిట్కా కు కావలసిన పదార్థాలు. ఒక గిన్నెలో ఒక స్పూన్ బాదం నూనె లో ఐదు చుక్కలు పిప్పర్మెంట్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని నుదిటిపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకుంటే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజ్ వాటర్ లో గంధంపొడి కలిపి నుదుటిపై రాసుకోవాలి. చందనం పొడి తలలో నరాలు వత్తిడిని తగ్గిస్తుంది తలకు చల్లదనాన్ని అందిస్తుంది. వెంటనే మైగ్రేన్ తలనొప్పి నుంచి రిలీఫ్ అందిస్తుంది. మందుల కంటే కూడా ఇంటి చిట్కాలు ప్రయత్నించడమే ఆరోగ్యానికి చాలా మంచిది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
No comments