Latest

Loading...

డయాబెటిస్‌ను అదుపు చేసే వేపాకులు.. ఎలా తీసుకోవాలంటే.....?

Neem leaf benefits


రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే దాన్ని డయాబెటిస్ అంటారు. ఇందులో టైప్ 1, 2 అని రెండు రకాలు ఉంటాయి. రెండో రకం డయాబెటిస్ అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది.


అయితే దీన్ని అదుపు చేసేందుకు వేపాకులు బాగా ఉపయోగపడతాయి. సైంటిస్టులు చెబుతున్న ప్రకారం డయాబెటిస్‌ను కంట్రోల్ చేసేందుకు వేపాకులు బాగా పనికొస్తాయి. అందుకు ఏం చేయాలంటే.


నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొన్ని వేపాకులను అలాగే నమిలి మింగాలి. లేదా వేపాకులతో కషాయం కాచి దాన్ని రెండు పూటలా తాగాలి. ఒక పాత్రలో అర లీటరు నీటిని తీసుకుని అందులో 20 వరకు వేపాకులను వేసి బాగా మరిగించాలి. దీంతో నీరు డార్క్ గ్రీన్ కలర్‌లోకి మారుతుంది. తరువాత ఆ నీటిని సేకరించి నిల్వ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం 2 పూటలా ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావచ్చు.


ఇండియన్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ అనే జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం వేపాకులు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయని వెల్లడైంది. డయాబెటిస్ ఉన్నవారు చేదుగా ఉండే పదార్థాలను తినడం ద్వారా దాన్ని అదుపు చేయవచ్చు. వేపాకులు కూడా చేదుగా ఉంటాయి. అందువల్ల ఇవి షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తాయి.


అలాగే వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక డయాబెటిస్ అదుపులోకి రావాలంటే పై విధంగా వేపాకులను వాడాల్సి ఉంటుంది.

No comments

Powered by Blogger.