Latest

Loading...

New study: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు..... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు తెలుసా....?

New study

 గుండె పోటు లాంటి హృదయ సంబంధ వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తున్నాయి. 40 ఏళ్ల వయసులోపు వారు కూడా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలతో మరణించడం చూస్తూనే ఉన్నాం


కనుక గుండెకు సంబంధించిన ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేరు శెనగపలుకులు గుండెకు మేలు చేస్తాయని తాజా అధ్యయనం తేల్చింది. జపాన్లోని కొంతమంది పురుషులు, మహిళలపై ఈ అధ్యయనం చేశారు. వారిలో రోజూ వేరు శెనగపలుకులు తినే ప్రజల్లో స్ట్రోక్ లేదా గుండె సంబంధింత వ్యాధులు సంభవించే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.ఈ అధ్యయనం ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి జర్నల్ 'స్ట్రోక్' లోప్రచురించారు.


గతంలో కూడా అమెరిక్లనలో వేరుశెనగ పలుకులు తినే వారిలో గుండె ఆరోగ్యం మెరుపడిందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఈసారి జపనీస్ పురుషులు, మహిళలపై చేసిన అధ్యయనంలో గుండె జబ్బుల్లో ఒకటైన 'ఇస్కీమిక్ స్ట్రోక్' ను వేరుశెనగపలుకులు నిరోధిస్తాయని కనిపెట్టారు. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టి ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. ఈ స్ట్రోక్ ను రాకుండా చేయడంలో వేరుశెనగపలుకులు ముందుటాయి. అందుకే అధ్యయనకర్తలు రోజుకు కనీసం నాలుగు నుంచి అయిదు పలుకులనైనా తినమని సిఫారసు చేస్తున్నారు.


ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ ప్రొఫెషర్ సయోటో ఇకెహరా మాట్లాడుతూ 'ఈ అధ్యయనంలో  వేరు శెనగ వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ తగ్గుతుందనే విషయాన్ని కనిపెట్టాము. ఆసియా ప్రజల్లో అధికంగా వేరుశెనగను తినేవాళ్లకి ఈ సమస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది' అని వివరించారు. వేరు శెనగలో గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు... మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల హైబీపీ, చెడు కొలెస్ట్రాల్, వాపు వంటి అనర్థాలు కలగవు. ఈ అధ్యయనాన్ని దాదాపు 74,000 మందిపై స్త్రీ పురుషులపై నిర్వహించారు.


రోజుకు నాలుగైదు వేరు శెనగ పలుకులు తినడం వల్ల

1. 20 శాతం ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

2. 16 శాతం స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది.

3. 13 శాతం గుండె సంబంధింత ఇతర వ్యాధులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది.


ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక కచ్చితంగా రోజూ వేరు శెనగ పలుకులు తినడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు అధ్యయన కర్తలు.


No comments

Powered by Blogger.