Latest

Loading...

ఇకపై వారికి మాస్క్ అక్కర్లేదు.. కేంద్రం సంచలన ప్రకటన..!

No mask

 కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలంతా మాస్కులు ధరించాల్సి వస్తోంది. బయటకొస్తే మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం అయింది.


కరోనా ప్రమాదకరంగా ఉండటంతో బయటకొస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకపోతే రూ.1000 ఫైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా.. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేసిన లక్షల మందికి ఫైన్ వేశారు. బైక్, కార్‌లో వెళ్లినా మాస్క్ ఉండాలని ప్రభుత్వం ప్రకటించి ఫైన్లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఒంటరిగా వెళ్తే ఏం ప్రమాదం ఉండదని ఎందుకు ఫైన్లు వేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒంటరిగా బైక్, సైకిల్‌పై వెళ్లే వారు మాస్కు ధరించడం వారి ఇష్టమని, ఎలాంటి చలాన్లు విధించొద్దని ఆదేశించింది. కరోనా విజృంభన తగ్గిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

No comments

Powered by Blogger.