Latest

Loading...

NTR ఎన్టీఆర్ కార్లన్నిటికీ ఒకే నెంబర్ ఎందుకుంటుందో తెలుసా..?

సాధారణంగా మన స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటికే ఈయన గ్యారేజ్‌లో పదికి పైగా కార్లు ఉండగా..

ఈ మధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు.



అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్తన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అసలు అన్ని కార్లకు ఎన్టీఆర్ ఒకే నెంబర్ ఎందుకు వాడతారు..? అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ నెంబర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ, నిజానికి కార్ నెంబర్ విషయంలో ఎన్టీఆర్‌కు ఎలాంటి సెంటిమెంట్స్ లేవట.


మరెందుకు ఒకే నెంబర్ వాడుతున్నారు అనేగా మీ సందేహం.. అందుకు ఓ కారణం ఉంది. ఎన్టీఆర్‌కు 9 అనే అంకె అంటే ఇష్టమట. అలాగే ఆయన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్‌ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పాడు. అందుకే మరో ఆలోచన లేకుండా తన కార్లకు అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని ఇటీవల ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.


 


No comments

Powered by Blogger.