PAN Aadhaar link పాన్-ఆధార్ లింక్ గడువు మళ్లీ పొడిగింపు...... మరో 6 నెలలు...?.
పాన్ కార్డు – ఆధార్ లింక్ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ).. ఐటీ రిటర్న్స్ దాఖలకు పాన్-ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది కేంద్రం..
అయితే, ఈ లింకింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు.. దీంతో మరోసారి గడువును పొడిగింది.. గతంలో నిర్ధేషించిన గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుండగా.. ఇప్పుడు వచ్చేఏడాది మార్చి 31 వరకు పొడిగించింది ఆదాయపుపన్నుశాఖ.. కరోనా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరో 6 నెలల సమయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేసేందుకు సైతం గడువును ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది.
No comments